#MissionPaani: అమితాబ్ చేతుల మీదుగా ప్రారంభమైన మిషన్ పానీ క్యాంపెయిన్..

మిషన్ పానీ క్యాంపెయిన్ లాంచ్‌లొ విద్యార్థులు

MissionPaani : నీటి పరిరక్షణ, తాగునీటి సంక్షోభంపై అవగాహన కల్పించేందుకు నెట్‌వర్క్,హార్పిక్‌ సంస్థలు సంయుక్తంగా మిషన్ పానీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత వేగంగా దెబ్బతింటోందని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల నివేదిక స్పష్టం చేసింది.ముఖ్యంగా భూమిపై తాగునీటి సంక్షోభం అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.పెరుగుతున్న పారిశ్రామికీకరణ,పట్టణీకరణ తాగునీటి అవసరాలను పెంచగా.. అడవులు తగ్గిపోవడం,చెట్లను పెంచకపోవడం వంటి కారణాలు ఇందుకు కారణమవుతున్నాయి. దానికి తోడు నీటి పొదుపుపై సరైన అవగాహన లేకపోవడం.. భూగర్భ జలాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారం నీటిని వినియోగించడం భవిష్యత్ తరాలకు ప్రమాద సంకేతాలను పంపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో నీటి పరిరక్షణ, తాగునీటి సంక్షోభంపై అవగాహన కల్పించేందుకు నెట్‌వర్క్,హార్పిక్‌ సంస్థలు సంయుక్తంగా మిషన్ పానీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ,గజేంద్రసింగ్ శఖావత్,మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం సంపన్నులు మాత్రమే ప్రాథమిక వనరులను పొందగలిగే స్థితి నెలకొంది. సాధారణ ప్రజానీకం తాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితి. ఈ సమస్యను గుర్తించకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవు. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామీకరణ వేగంగా పెరుగుతుండటంతో నీటి డిమాండ్‌ పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు ప్రజలు అధికంగా రావడం ఈ డిమాండ్‌ను మరింత పెంచుతోంది. గ్రామీణ ప్రజలతో పోలిస్తే పట్టణవాసులు ఎక్కువ నీటిని వినియోగిస్తారు. దేశంలోని మంచినీటి సరఫరాలో 40 శాతం ఉన్న భూగర్భజలాలు కొన్నేళ్లుగా క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇటీవల జరిపిన నిపుణుల అధ్యయనాల ప్రకారం, రాబోయే కొద్ది సంవత్సరాల్లో 21 భారతీయ నగరాలు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది.

    రసాయనాలు, పారిశ్రామిక మరియు పట్టణ వ్యర్థాలతో పాటు మురుగునీటిని సరస్సులు, నదులతో వదలడం వలన మంచినీటి వనరులు ఎక్కువగా కలుషితమవుతున్నాయి. సమీప భవిష్యత్తులో ఉపరితల నీటి యూట్రోఫికేషన్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక నీరు ఉండగా, మరికొన్ని శాశ్వత కరువును ఎదుర్కొంటున్నాయి. పట్టణ వినియోగదారులు, వ్యవసాయ రంగం మరియు పరిశ్రమల మధ్య సమర్థవంతమైన నీటి నిర్వహణ మరియు నీటి పంపిణీ లేకపోవడం కూడా ఈ ఆందోళనకు ప్రధాన కారణం.ఈ సమస్యలన్నింటిపై అవగాహన కల్పించేందుకు నెట్‌వర్క్18-హార్పిక్ సంస్థలు మిషన్ పానీ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నాయి.

    First published: