Amit Shah | రాజకీయ ఎత్తుగడలతో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టడం.. బీజేపీని అధికారంలోకి తేవడంలో అమిత్‌షా రాజకీయ చతురత కూడా కారణం. తాజాగా ఆయన చేసిన వాఖ్యలు ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అదే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ.
రాజకీయ ఎత్తుగడలతో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టడం..బీజేపీ (BJP)ని అధికారంలోకి తేవడంలో అమిత్‌షా రాజకీయ చతురత కూడా కారణం. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అదే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. జమ్ముకాశ్మీర్ (Jammu and Kashmir) లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన అన్నారు. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత రాష్ట్రహోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ‘డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్’ విడుదల కార్యక్రమంలో వర్చువల్‌గా అమిత్‌షాల పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీ ర్ అభివృద్ధే ప్రధాని మోదీ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
కాశ్మీర్‌కు పెట్టుబడులు..
ఈ సదస్సులో పాల్గొన్న అమిత్‌షా (Amit Shah) జమ్మూకాశ్మీర్‌కు పెట్టుబడుల అంశంపై మాట్లాడారు. కాశ్మీర్‌కు పెట్టుబడులు బాగా వస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే రూ.12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కాశ్మీర్‌కు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆయన తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దుతో మారిన పరిస్థితి..
జమ్ము కాశ్మీర్లో ఆర్టికల్ 370 (Article 370) రద్దు కంటే ముందు రాష్ట్రంలో 114 అసెంబ్లీ సీట్లు ఉండేవి. అందులో 87 మంది ఎమ్మెల్యే లు, ఆరుగురు ఎంపీలు ఉండేవారని, వారంతా మూడు కుటుంబాలకు చెందిన వారేనని అమిత్‌షా అన్నారు. కాశ్మీర్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చాక ఇప్పుడు 30 వేలమంది పంచాయతీ సభ్యులు ప్రజాసేవలో ఉన్నారని అమిత్‌షా చెప్పారు. ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తేనే జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు మెరుగుపడతాయని కొందరు వాదిస్తున్నారని కానీ ఇప్పటికే కాశ్మీర్ పరిస్థితి చాలా మెరుగైందని అమిత్‌షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో 40శాతం ఉగ్రవాదుల దాడులు తగ్గాయని ఆయన వివరించారు. జమ్ము కాశ్మీర్‌కు కేంద్రం కేటాయించే బడ్జెట్ రూ.9వేల కోట్ల నుంచి 21 వేల కోట్లకు పెరిగిందని ఆయన అన్నారు. మోదీ (Modi) ప్రభుత్వం కాశ్మీర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
2026 జరిగే అవకాశం..
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో బీజేపీకి లబ్ధి చేకూరుతుందని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. 2026 దేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థికరణ ఉంటుంది. దీని ద్వారా దేశంలో అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను సవరిస్తారు. పెంచడం, తగ్గించడంతోపాటు. నియోజకవర్గాల పరిధిని జనాభా ప్రకారం మార్చే అవకాశం ఉంటుంది. అయితే నియోజకవర్గా పునర్విభజన బీజేపీకి లబ్ధి అని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్‌షా ప్రకటనతో ఈ వ్యవహరంలో బీజేపీ పక్కా ప్రణాళికతో ఉందని వాదనులు వినిపిస్తున్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.