Home /News /national /

AMIT SHAH TO CHAIR 29TH MEETING OF SZC MEETING IN TIRUPATI TN CM STALIN KERALA CM VIJAYAN TS CM KCR TO SKIP EVENT MKS

సీఎంలకు ఏమైంది? Amit Shah అధ్యక్షతన SZC భేటీకి కేసీఆర్ సహా ముగ్గురు సీఎంలు డుమ్మా -జగన్ విందుతో..

అమిత్ షాతో భేటీకి ముగ్గురు సీఎంలు డుమ్మా

అమిత్ షాతో భేటీకి ముగ్గురు సీఎంలు డుమ్మా

ఎస్‌జెడ్‌సీ సమావేశానికి గైర్హాజరయ్యే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను మరో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఆ ఇద్దరు సీఎంల గైర్హాజరుకు కారణాలు వేరుగా ఉన్నాయి. అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో ఇద్దరు సీఎంలు మాత్రమే పాల్గొంటారు..

ఇంకా చదవండి ...
రాష్ట్రాల మధ్య నెలకున్న సరిహద్దు వివాదాలు, భద్రత అంశాలు, రోడ్లు, రవాణా, పరిశ్రమలు, జల, విద్యుత్ సహా పలు అంశాలపై జోన్ల వారీగా అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. తాజగా సదరన్ జోన్ కౌన్సిల్ (ఎస్‌జెడ్‌సీ) సమావేశానికి సిద్ధమైంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆతిథ్యంలో ఆథ్యాత్మిక నగరం తిరుపతిలో ఎస్‌జెడ్‌సీ సమావేశం జరుగనుంది. తిరుపతిలోని తాజ్ హోటల్ లో ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 3.47 గంటలకు మొదలై, సాయంత్రం 6.45 గంటలకు భేటీ ముగియనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయానికి సంబంధించి అత్యంత కీలకంగా భావించే జోనల్ కౌన్సిల్ భేటీకి ఈసారి దక్షిణాదిలో ఏకంగా ముగ్గురు సీఎంలు గైర్హాజరవుతుండటం చర్చనీయాంశమైంది.

ఏపీ వర్సెస్ తెలంగాణ సీన్?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఎస్‌జెడ్‌సీ సమావేశానికి హాజరుకావాలని ముందుగా అనుకున్నా, అనూహ్య రీతిలో మనసు మార్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. హుజూరాబాద్ ఫలితం, కేంద్రంపై యుద్ధ ప్రకటన తదితర అంశాల నేపథ్యంలోనే ఆయన షాతో భేటీకి సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ తరఫున హోం మంత్రి మహమూద్ అలీ, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తిరుపతి భేటీలో పాల్గొంటారు. అయితే, తెలంగాణతో జల వివాదాలు, విద్యుత్ బకాయిల చెల్లింపు, ట్రిబ్యూనళ్ల ఏర్పాటు తదితర అంశాలపై ఏపీ చర్చకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భేటీ ఫలితం ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠగా మారింది. కాగా,

kcr మరో సంచలనం -amit shahతో కీలక మీటింగ్‌కు డుమ్మా -తిరుపతి SZC భేటీపై రాజకీయ నీడలు?


స్టాలిన్, విజయన్ కూడా రావట్లే
ఎస్‌జెడ్‌సీ సమావేశానికి గైర్హాజరయ్యే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను మరో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఆ ఇద్దరు సీఎంల గైర్హాజరుకు కారణాలు వేరుగా ఉన్నాయి. అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హాజరుకావడం లేదు. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ, వరద పరిస్థితి నెలకొన్న దరిమిలా తమిళనాడు, కేరళ సీఎంలు తిరుపతికి రాలేకపోతున్నారు. స్టాలిన్ ఆదివారం నాడు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుండగా, కేరళలో వరద పరిస్థితిపై సీఎం విజయన్ కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు బదులు మంత్రులు, సీఎస్ లు అమిత్ షాతో భేటీ అవుతారు. దీంతో..

YS Viveka murder : గొడ్డలితో నరికి.. కొనఊపిరితో లేఖ రాయించి.. పెద్దల హస్తం ఉదంటూ సంచలన వాగ్మూలం


ఇద్దరే సీఎంలు.. జగన్ విందు
దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ముగ్గురు సీఎంలు గైర్హాజరు కానుండటంతో సదరన్ జోనల్ సమావేశంలో ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులే ఉంటారు. ఆతిథ్య రాష్ట్రంగా ఏపీ సీఎం జగన్, కర్ణాటక బీజేపీ సీఎం బసవరాజ్ బొమ్మైతోపాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రపుల్‌ ఖోడా పటేల్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ దేవేంద్రకుమార్‌ జోషి అమిత్ షాతో సమావేశంలో పాల్గొంటారు. మొత్తం 23 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, ఏపీ అభ్యర్థన మేరకు మూడు రాజధానులు తదితర అంశాలను చేర్చడంతో అజెండా అంశాల సంఖ్య 26కు పెరిగింది. కాగా, సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ముగిసిన తర్వాత రాత్రి 7.30కు ఏపీ సీఎం జగన్‌ సదస్సుకు హాజరైనవారికి విందు ఇస్తారు. దీంతో కార్యక్రమం ముగిసినట్లవుతుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Amit Shah, Ap cm jagan, CM KCR, Kerala, MK Stalin, Pinarayi Vijayan, Tamil nadu, Tirupati

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు