హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర హోదాపై హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర హోదాపై హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది.

  కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌పై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. సరైన సమయంలో జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. శనివారం జమ్మూకాశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2021కు లోక్‌సభ ఆమోద ముద్రవేసింది. ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా..బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమన్నట్లు కాదని, సరైన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఈ బిల్లులో ఎక్కడా లేదని, దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

  కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లు పాలనలో జమ్మూ కాశ్మీర్‌కు ఏం చేసిందో చెప్పాలని ఈ సందర్భంగా నిలదీశారు అమిత్ షా. కశ్మీర్‌లో హింస, అశాంతి పరిస్థితులు మళ్లీ రాబోవని ఆయన అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కాశ్మీర్ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్లు వెల్లడించారు. కాశ్మీర్‌ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. జేకేలో అధికార పంపిణీ జరుగుతోందన్న ఆయన.. పంచాయతీలకు పరిపాలన, ఆర్థికపరమైన అధికారాలు కల్పించినట్టు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో పాటు 51శాతం పైగా పోలింగ్ నమోదవడం శుభపరిణామమన్నారు అమిత్ షా.

  కాశ్మీర్ లోయలో 2022 నాటికి రైలు మార్గం ఏర్పాటవుతుందని అమిత్ షా తెలిపారు. అంతేకాదు 2022 నాటికి 25వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పార్లమెంట్ వేదికగా హామీ ఇచ్చారు. అక్కడి ప్రజలెవరూ భూమిని కోల్పోరని ఆమన అన్నారు. జమ్మూకాశ్మీర్‌తో పాటు లద్దాఖ్ ప్రాంతాల్లో ఎయిమ్స్ పనులు ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు అమిత్ షా.

  జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ఇక జమ్ముకాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించగా.. తాజాగా లోక్‌సభ కూడా ఆమోద ముద్రవేసింది.

  First published:

  Tags: Amit Shah, Jammu and Kashmir, Ladakh

  ఉత్తమ కథలు