కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హోం మంత్రి అమిత్ షా.. నేడు జరిగిన సహకారం సంస్థల మెగా సదస్సులో(National Cooperative Conference) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార రంగంలో ప్రభుత్వ ప్రణాళికలు, అభివృద్దికి కేంద్రం తీసుకున్న చర్యలను అమిత్ షా వివరించారు. సహకార సంఘాలు దేశ అభివృద్దిలో ముఖ్యమైన సహకారం అందించగలవని అమిత్ షా అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి సహకార రంగం కూడా కృషి చేస్తుందని ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నట్టుగా చెప్పారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మెగా సదస్సులో 2,000కు పైగా సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతేకాకుండా వర్చువల్ విధానంలో ఇండియా నుంచి విదేశాల నుంచి ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. ‘దేశంలో అగ్రశ్రేణి నాయకులు పండింట్ దీన్ దయాళ్ జయంతి రోజున ఈ సహకార సదస్సు జరుగుతుండటం చాలా సంతోషం. ఎందుకంటే నాలాంటి చాలా మంది కార్మికులు సహకార సంఘంలో చేరడానికి అసలు స్ఫూర్తి దీనదయాళ్ అంత్యోదయ విధానం. సహకార సంఘాలు లేకుండా పేదల సంక్షేమం ఊహించలేము. స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ల తర్వాత.. సహకార ఉద్యమం (cooperative movement) అత్యంత అవశ్యకతగా ఉన్న సమయంలో దేశ ప్రధాని మోదీ సహకార మంత్రిత్వ శాఖను తీసుకొచ్చారు. ఆయన మన అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’అని చెప్పారు.
PM Modi Assets: ప్రధాని మోదీ ఆస్తులు ఇవే.. ఆయన వద్ద ఎంత బంగారం, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయో తెలుసా..?
సహకార సంఘాలు దేశ అభివృద్దిలో ముఖ్యమైన సహకారం అందించగలవని అమిత్ షా అన్నారు. దేశాభివృద్దిలో సహకార సంఘాల పాత్ర ఉందని చెప్పారు. కొత్తగా ఆలోచించాలని.. పని పరిధిని విస్తరించి.. పారదర్శకతను తీసుకురావాలని ఆయన కోరారు. ప్రతి గ్రామానికి సహకార రంగాన్ని తీసుకెళ్లాలి. ప్రతి గ్రామాన్ని సహకారం నుంచి శ్రేయస్సు అనే మంత్రంతో సంపన్నం చేయడం ద్వారా దేశాన్ని సుభిక్షంగా మార్చడమే ఈ శాఖ పాత్ర అని చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి సహకార రంగం కూడా కృషి చేస్తుందని ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నట్టుగా చెప్పారు.
Delhi | Union Home Minister and Minister of Cooperation Amit Shah attends the ‘National Cooperative Conference’ at Indira Gandhi Indoor Stadium pic.twitter.com/iifR4OVRPl
— ANI (@ANI) September 25, 2021
సహకార ఉద్యమం దేశంలో గ్రామీణ ప్రాంతాలను కూడా పురోగమిస్తుందని అమిత్ షా అన్నారు. దేశంలోని కొన్ని కోట్ల కుటుంబాలు సహకార సంఘాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. సహకార సంఘాలు అనేవి పేదలు, వెనకబడిన వర్గాల అభివృద్ది కోసం పనిచేసేవని వివరించారు. సహకార సంఘాలు భారతదేశ సంస్కృతిలో భాగంగా ఉన్నాయని అన్నారు. పేదల విప్లవానికి కొత్త దిశానిర్దేశం చేసే పనిని ఇఫ్కో(IFFCO) చేసిందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో దాదాపు 91% గ్రామాలలో చిన్న, పెద్ద సహకార సంస్థలు ఉన్నాయని అమిత్ అన్నారు. 91% గ్రామాల్లో సహకార సంఘాలు ఉన్న దేశం ప్రపంచంలోనే ఎక్కడ ఉండదని అన్నారు.
విపత్తులు సంభవించినప్పుడు.. సహాయం చేయడానికి సహకార సంఘాలు ముందుకు వచ్చాయని చెప్పారు. సహకార సంఘాలు అనేక ఒడిదుడుకులు చూశాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకురావడమే సహకార మంత్రిత్వ శాఖ లక్ష్యం. గత ఏడేళ్ల ప్రధాని మోదీ వ్యవసాయం రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. 2009-10లో వ్యవసాయ బడ్జెట్ రూ .12,000 కోట్లు ఉండగా.. అది మోదీ ప్రభుత్వంలో 2020-21 నాటికి రూ .1,34,499 కోట్లకు పెరిగిందని తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల సహకారంతో ముందుకు సాగుతుందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.