అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు... ఖండించిన కేంద్ర హోంమంత్రి...

అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు... ఖండించిన కేంద్ర హోంమంత్రి...

అమిత్ షా

తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు.

 • Share this:
  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లను ఆయన ఖండించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన తన సందేశాన్ని వినిపించారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వారి కోసం ఆయన లేఖను విడుదల చేశారు. అందులో తాను ఎలాంటి అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘కొన్ని సోషల్ మీడియాల్లో నా ఆరోగ్యం గురించి వార్తలు రాశారు. కొందరైతే ఏకంగా నేను చనిపోయినట్టు సంతాపాలు కూడా ప్రకటించారు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా. ఎలాంటి అనారోగ్య సమస్య లేదు.’ అని అమిత్ షా స్పష్టం చేశారు.

  అమిత్ షా సందేశం...
  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొందరు నా ఆరోగ్యం మీద పుకార్లు ప్రచారం చేశారు.కొందరైతే ఏకంగా నా మరణం గురించి ట్వీట్లు చేసి సంతాపాలు ప్రకటించారు. ప్రస్తుతం దేశం కరోనా వైరస్ మహమ్మారి మీద పోరాడుతోంది. కేంద్ర హోంమంత్రిగా రాత్రింబవళ్లు నేను పనిలో నిమగ్నం కావడం వలన వాటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కొందరు భ్రాంతిలో బతుకుతూ ఆనందం పొందుతుంటారనే ఉద్దేశంతో నేను స్పందించలేదు. కానీ, మా పార్టీకి చెందిన కొన్ని లక్షల మంది నా ఆరోగ్యం గురించి చింతిస్తున్నారు. వారి ఆందోళనను నేను విస్మరించలేను. అందుకే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. నాకు ఎలాంటి జబ్బు లేదు. హిందూ నమ్మకాల ప్రకారం ఇలాంటి పుకార్లు మరింత ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అందుకే వారందరికీ చెబుతున్నా. మీరు ఈ పనికిమాలిన పనులు పక్కన పెట్టి నా పని నన్ను చేసుకోనివ్వండి. మీ పని మీరు చేసుకోండి. నా ఆరోగ్యం గురించి కంగారు పడిన పార్టీ కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. నా మీద ఎవరైనా పుకార్లు లేవనెత్తారో వారి మీద ఎలాంటి ద్వేషం లేదు. వారికి కూడా నా ధన్యవాదాలు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు