• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • AMIT SHAH ON NEWS18 MODI GIVES HOPE TO 60 CRORE PEOPLE SAYS AMIT SHAH SK

Amit Shah on News18: మోదీ పాలనలో 60 కోట్ల మంది జీవితాలు మారాయి: అమిత్ షా

Amit Shah on News18: మోదీ పాలనలో 60 కోట్ల మంది జీవితాలు మారాయి: అమిత్ షా

న్యూస్ 18తో అమిత్ షా ఇంటర్వ్యూ

ఎన్డీయే పాలనలో రైతులు, మహిళలు, చిరువ్యాపారులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని అమిత్ షా అన్నారు.

  • Share this:
    ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో 60 కోట్ల మంది జీవితాలు మారాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 60 ఏళ్లలో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందుకోని ప్రజలకు మోదీ పాలనలో ఎంతో లబ్ధి చేకూరిందని తెలిపారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన చెప్పారు. నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మోదీ 2.0 ప్రభుత్వ ఏడాది పాలనకు సంబంధించి అమిత్ షా మాట్లాడారు. గత ఆరేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, పథకాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఎన్డీయే పాలనలో రైతులు, మహిళలు, చిరువ్యాపారులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు అమిత్ షా.

    ''మోదీ 1.0, మోదీ 2.0 వేర్వేరు కాదు. ఎన్డీయే ప్రభుత్వం 31 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచింది. మధ్యవర్తిత్వానికి తావు లేకుండా ప్రభుత్వ పథకాల ఫలాలు నేరుగా లబ్ధి దారులకే చేరుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకంతో 51 మంది లబ్ధి పొందుతున్నారు. అర్టికల్ 370 రద్దు ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. దాన్ని నెరవేర్చాం. పక్క దేశాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న మైనార్టీలకు పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో CAA తీసుకొచ్చాం.'' అని అమిత్ షా అన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు