షా, థాక్రే భేటీకి ఫడ్నవీస్‌ను దూరంపెట్టిన శివసేన!

మాతోశ్రీలోని రెండో అంతస్తులో అమిత్‌షా, ఉద్ధవ్ థాక్రే 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఐతే ఆ సమయంలో ఫడ్నవీస్‌ను గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Shiva Kumar Addula | news18
Updated: June 7, 2018, 12:07 PM IST
షా, థాక్రే భేటీకి ఫడ్నవీస్‌ను దూరంపెట్టిన శివసేన!
ఉద్థవ్ థాక్రేతో అమిత్ షా సమావేశం (ఫైల్ ఫొటో)
  • News18
  • Last Updated: June 7, 2018, 12:07 PM IST
  • Share this:
2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెట్టింది. ఎన్డీయేకు పలు పార్టీలు దూరమవుతున్న తరుణంలో మళ్లీ దగ్గరయయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.  అందుకోసం కాంటాక్ట్ ఆఫ్ సపోర్ట్ (మద్దతు కోసం కలవడం) ప్రచారాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారాంభించారు.  ఈ క్రమంలోనే ముంబైలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేను కలిశారు.

శివసేన పార్టీ ఆఫీసు మాతోశ్రీలో బుధవారం షా, థాక్రే భేటీ జరిగింది. ఐతే ఈ సమావేశానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్ధవ్ థాక్రే దూరంపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాల్‌గఢ్ లోక్‌సభ ఉప ఎన్నికల నుంచి ఫడ్నవీస్, ఉద్ధవ్ మధ్య దూరం పెరిగినట్లు  తెలిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ-శివసేన సమావేశానికి ఫడ్నవీస్‌ను దూరం పెట్టారని సమాచారం.

మాతోశ్రీలోని రెండో అంతస్తులో అమిత్‌షా, ఉద్ధవ్ థాక్రే 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఐతే ఆ సమయంలో ఫడ్నవీస్‌ను గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సమావేశం పూర్తయ్యే వరకు ఆయనే అక్కడే ఉన్నట్లు సమాచారం. కాగా, సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో మిత్రపక్షాల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో పొత్తుతో పాటు కేంద్రంలో కూటమిని ముందుకెళ్లే అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది

మే 28న జరిగిన పాల్‌గఢ్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ప్రచార సమయంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. మిత్రపక్షాల పట్ల మోడీ అనురిస్తున్న విధానాల పట్ల శివసేన కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆ క్రమంలోనే మోడీ టార్గెట్‌గా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు శివసేన నేతలు.

పాల్‌గఢ్ ఉపఎన్నికలో ఓటమి అనంతరం బీజేపీని "అతి పెద్ద రాజకీయ శత్రువు"గా శివసేన అభివర్ణించింది. అమిత్‌షా భేటీపైనా ఆ పార్టీ పత్రిక సామ్నా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. నాలుగేళ్ల తర్వాత ఉద్దవ్‌తో ఇప్పుడు ఎందుకు భేటీకి కావాల్సి వచ్చింది? అనే ప్రశ్నను లేవనెత్తింది. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన గతంలోనే ప్రకటించింది.
Published by: Shiva Kumar Addula
First published: June 7, 2018, 11:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading