తెలంగాణపై అమిత్ షా ఫోకస్...ఆ ఎంపీతో ఏకాంత భేటీ..?

ఇదిలా ఉంటే గతంలో టీడీపీలో చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన గరికపాటి మోహనరావు ఇటీవలే పార్టీ మార్పులో భాగంగా బీజేపీ గూటిలో చేరారు. అంతేకాదు 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచేందుకు దోహదం చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు గరికపాటి మోహనరావు సమన్వయ కర్తగా వ్యవహరించడం కొసమెరుపు.

news18-telugu
Updated: November 4, 2019, 5:01 PM IST
తెలంగాణపై అమిత్ షా ఫోకస్...ఆ ఎంపీతో ఏకాంత భేటీ..?
అమిత్ షా ఫైల్ ఫోటో..
  • Share this:
తెలంగాణకు చెందిన రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్‌రావుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా తెలంగాణ పరిస్థితులతో పాటు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనే వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం లభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో అమిత్ షా పర్యటనలపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సభల నిర్వహణ పై కూడా ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణలో ఇటీవలే జరిగిన ఉపఎన్నిక గురించి కూడా ఇరువురు చర్చించినట్టు సమాచారం. దీంతో తెలంగాణలో బీజేపీ విస్తరణకు దోహదపడేలా సభల ఏర్పాటుకు కార్యాలచరణ రూపొందించాలని కూడా అమిత్‌షా గరికపాటికి సూచించినట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ వ్యవహారాల్లో గరికపాటిని కీలకంగా వ్యవహరించేలా అమిత్‌షా కొన్నిసూచనలు చేసినట్టు తెలిసింది.

ఇదిలా ఉంటే గతంలో టీడీపీలో చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన గరికపాటి మోహనరావు ఇటీవలే పార్టీ మార్పులో భాగంగా బీజేపీ గూటిలో చేరారు. అంతేకాదు 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచేందుకు దోహదం చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు గరికపాటి మోహనరావు సమన్వయ కర్తగా వ్యవహరించడం కొసమెరుపు.

First published: November 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...