ఏడాది చివర్లో 4 రాష్ట్రాలకు ఎన్నికలు... ఇప్పటి నుంచే పని మొదలుపెట్టిన అమిత్ షా

BJP New Election Target : దేశవ్యాప్తంగా భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ... విశ్రాంతి తీసుకోకుండా... నెక్ట్స్ టార్గెట్‌పై దృష్టి సారిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 10, 2019, 1:57 PM IST
ఏడాది చివర్లో 4 రాష్ట్రాలకు ఎన్నికలు... ఇప్పటి నుంచే పని మొదలుపెట్టిన అమిత్ షా
అమిత్ షా (File)
  • Share this:
ఈ ఏడాది చివర్లో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో గెలుపే లక్ష్యంగా బీజేపీ సీనియర్ నేత అమిత్ షా... ఇప్పటి నుంచీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ప్రధానంగా... మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల పార్టీ నేతలతో అమిత్ షా... బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ మూడు రాష్ట్రాలతోపాటూ జమ్మూకాశ్మీర్‌కి కూడా ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాలని సూచించిన అమిత్ షా... ఆల్రెడీ కేంద్రంలో ఎక్కువ సీట్లతో గెలిచాం కదా అని తేలిగ్గా తీసుకోవద్దనీ, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తనకు రిపోర్టులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం.

మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందీ అమిత్ షా వివరాలు అడిగారని ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో లాగానే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ, మిత్ర పక్షం శివసేన భారీ మెజార్టీతో తిరిగి గెలుస్తామన్నారు ఫడ్నవీస్. బీజేపీ పోటీ చేసే సీట్లలోనే కాకుండా... మిత్ర పక్షాలు పోటీ చేసే స్థానాల్లో కూడా ఆ పార్టీలు గెలిచేలా గట్టిగా పోరాడాలని షా సూచించినట్లు ఫడ్నవీస్ వివరించారు.

ప్రస్తుతం మహారాష్ట్రతోపాటూ జార్ఖండ్, హర్యానాలో కూడా బీజేపీయే అధికారంలో ఉంది. ఇక జమ్మూకాశ్మీర్‌లో 87 అసెంబ్లీ స్థానాలు ఉండగా... 28 స్థానాలతో పీడీపీ మొదటి పొజిషన్‌లో ఉండగా... 25 సీట్లతో బీజేపీ సెకండ్ పొజిషన్‌లో ఉంది. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నందువల్ల... తమ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల సంగతి ముందుగా తేల్చాలని అమిత్ షా భావిస్తున్నట్లు తెలిసింది. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్నది కాంగ్రెస్సే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోకూడదని భావిస్తున్న షా... ఇప్పటి నుంచే స్థానిక నేతలపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.

First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>