అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం... ఎయిమ్స్‌కి వెళ్లిన రాష్ట్రపతి, అమిత్ షా తదితరులు

అనారోగ్య కారణాలతో ఈ నెల 9న ఎయిమ్స్‌లో చేరిన అరుణ్ జైట్లీకి ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ విషమిస్తున్నట్లు తెలిసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 17, 2019, 5:38 AM IST
అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం... ఎయిమ్స్‌కి వెళ్లిన రాష్ట్రపతి, అమిత్ షా తదితరులు
అరుణ్ జైైట్లీ
  • Share this:
ఢిల్లీ ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలిసింది. ఈ నెల 9న ఆయన అనారోగ్య కారణాలతో ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచీ ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఐతే... తాజాగా ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలియడంతో... కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్... శుక్రవారం హడావుడిగా ఆస్పత్రికి వెళ్లారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా శుక్రవారం ఆసుపత్రికి వెళ్లారు. మంత్రి హర్షవర్ధన్‌, సహాయమంత్రి అశ్విని చౌబే... రాష్ట్రపతి సందర్శించిన టైమ్‌లో అక్కడే ఉన్నారు.

అనారోగ్యం వల్ల ఏ శాఖా చేపట్టని అరుణ్ జైట్లీ సేవలు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌కు చాలా అవసరం. వృత్తి రీత్యా లాయరైన ఆయన... మోదీ మొదటి క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు మాత్రం అరుణ్ జైట్లీకి సంబంధించి ఏ హెల్త్ బులిటెనూ జారీ చెయ్యలేదు. ఇప్పటివరకూ అమిత్ షా, హర్ష వర్ధన్, రామ్ నాథ్ కోవింద్‌తోపాటూ... ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, లోక్ తాంత్రిక్ జనతా దళ్ చీఫ్ శరద్ యాదవ్ తదితరులు... ఎయిమ్స్‌కి వెళ్లి అరుణ్ జైట్లీని పరామర్శించారు.

కొంతకాలంగా జైట్లీ కాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఈ ఏడాది మేలో కూడా అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చేరారు. అనారోగ్యం వల్లే ఆయన... 2019 లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2018 ఏప్రిల్ నుంచీ జైట్లీ... తన ఆఫీస్‌కి రావడం మానేశారు. ఈ ఏడాది మే 14న ఆయనకు రెనాల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. 2018 ఆగస్ట్ 23న ఆయన తిరిగి ఆర్థిక శాఖను చేపట్టారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న జైట్లీ... 2014 సెప్టెంబర్‌లో బరువు తగ్గించుకునేందుకు బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు.
First published: August 17, 2019, 5:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading