హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit Shah: ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టం.. 2023లో భారీ మెజార్టీతో గెలుస్తాం: అమిత్ షా

Amit Shah: ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టం.. 2023లో భారీ మెజార్టీతో గెలుస్తాం: అమిత్ షా

అమిత్ షా (ఫైల్‌)

అమిత్ షా (ఫైల్‌)

Amit Shah: రాజ‌స్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ (BJP) కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు ఆయ‌న చెక్ పెట్టారు

ఇంకా చదవండి ...

  రాజ‌స్థాన్‌ (Rajasthan)లోని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్  (Amit Shah) విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు ఆయ‌న చెక్ పెట్టారు. గ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి (BJP) ఎప్పుడూ ప్రయత్నించదని, కానీ 2023లో మూడింట రెండు వంతుల మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా అన్నారు. “తన ప్రభుత్వం పడిపోతుందనే భయం అతనికి నిరంతరం ఉంటుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చేది ఎవరు? మీ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టడం లేదు...మీ ప్రభుత్వాన్ని బీజేపీ ఎప్పటికీ పడగొట్టదు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా 2023లో మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది’’ అని జైపూర్‌లో జరిగిన బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతల సమావేశంలో షా అన్నారు.

  యూపీ ఎన్నిక‌ల‌తో పాటు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం..

  2020లో కాంగ్రెస్‌లో అప్పటి డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) నేతృత్వంలోని 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత, గెహ్లాట్ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అమిత్‌షా ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ నాయ‌కులు అంతర్గత విభేదాలతో బిజీగా ఉన్నార‌ని అన్నారు.

  Ayushman Cards: రూ.5ల‌క్ష‌ల బీమా కార్డు.. అర్హ‌త ఉంటే ఇకపై ఉచితంగా పొంద‌వ‌చ్చు


  రాజస్థాన్‌లో శాంతిభద్రతల నిర్వచనాన్ని మార్చారు. మీ ప్రభుత్వం బాగా నడుస్తోందని మీరు పేర్కొంటే, UP ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించండి అని స‌వాలు విసిరారు. రాజస్థాన్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మీకు వెంటనే తెలుస్తుంది. అయితే మీరు 2023 వరకు మీ పదవీకాలాన్ని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము, కానీ రాజస్థాన్ ప్రజల కోసం కూడా పని చేయాలని షా అన్నారు.

  2020లో రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి కాంగ్రెస్ ముగింపు ప‌లికింది. సొంత ఎమ్మెల్యేల‌తో స‌చిన్ పైలెట్ తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ (Congress) పెద్దల రాజ ప్రయత్నాలు ఫలించడంతో..సచిన్ పైలట్ నేతృత్వంలోని కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సొంతగూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం సమిసిపోయినట్లయ్యింది.

  Jammu and Kashmir: మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: ఫరూక్ అబ్దుల్లా


  ఈ సంక్షోభం ముగిసిన స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తనపై తిరుగుబాటు చేయటానికి కారణాలు ఏంటో తెలుసుకుని...వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని గెహ్లాట్ చెప్పారు. అలాగే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ...అసంతృప్త పార్టీ ఎమ్మెల్యేల సమస్యలు అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటుందని అన్నారు. అంతే కాకుండా బీజేపీ త‌న ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని చూస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బీజేపీ నేతలు ఎన్ని బేరసారాలు జరిపినా...ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేను కూడా తమ వైపునకు తిప్పుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అప్ప‌టి నుంచి బీజేపీ రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూలుస్తుంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Amit Shah, Assembly Election 2022, Bjp, Congress, Rajastan, Sachin Pilot

  ఉత్తమ కథలు