Home /News /national /

AmitShah To News18: బీహార్‌లో అందుకే అలా జరిగిందన్న అమిత్ షా

AmitShah To News18: బీహార్‌లో అందుకే అలా జరిగిందన్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

AmitShah To News18: ఈసారి కూటమిలోకి కొత్త మిత్రులు చేరారని అమిత్ షా తెలిపారు. ఈ కారణంగా బీజేపీ, జేడీయూ కూడా కొన్ని సీట్లు వదులుకున్నాయని అన్నారు.

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌జేపీకి సమంజసమైన రీతిలోనే సీట్లను ఇస్తామని చెప్పినట్టు కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్‌డీయే నుంచి ఎల్‌జేపీ(లోక్ జనశక్తి పార్టీ) బయటకు వెళ్లిపోవడంపై ఆయన స్పందించారు. ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై మాట్లాడిన అమిత్ షా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల అంశంపై కూడా వివరించారు. బీహార్‌లో బీజేపీ,జేడీయూ, ఎల్‌జేపీ కూటమికి సంబంధించి ఎల్‌జేపీకి సమంజసమైన స్థాయిలోనే సీట్లు ఇచ్చేందుకు బీజేపీ, జేడీయూ అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఇందుకు సంబంధించి పలుసార్లు చర్చలు కూడా జరిగాయని అన్నారు. ఇందుకు సంబంధించిన తాను వ్యక్తిగతంగా చిరాగ్ పాశ్వాన్‌తో మాట్లాడానని అన్నారు.

    ఈసారి కూటమిలోకి కొత్త మిత్రులు చేరారని అమిత్ షా తెలిపారు. ఈ కారణంగా బీజేపీ, జేడీయూ కూడా కొన్ని సీట్లు వదులుకున్నాయని అన్నారు. అయితే ఎల్‌జేపీ విషయంలో ఇది సాధ్యపడలేదని అన్నారు. ఏకపక్షంగా ఎల్‌జేపీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇబ్బందిగా మారాయని అమిత్ షా తెలిపారు. ఎన్నికల తరువాత మళ్లీ ఎల్‌జేపీ ఎన్డీయేలోకి వచ్చే అవకాశాలపై కూడా అమిత్ షా స్పందించారు. ఈ కూటమి ఎవరి వల్ల ముక్కలైందో బీహార్ ప్రజలకు తెలుసు అని అన్నారు. ఎన్నికల తరువాత ఎల్‌జేపీ ఎన్డీయేలోకి వస్తుందేమో చూడాలని అన్నారు. ప్రస్తుతానికి తాము ప్రత్యర్థులమని.. ఆ రకంగానే పోటీలో ఉంటామని అన్నారు.

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించిన ఎల్‌జేపీ.. సీఎం నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పించింది. తాము జేడీయూ అభ్యర్థులతో ఎన్నికల్లో పోరాడతామని ప్రకటించింది. అక్టోబర్ 31 నుంచి జేడీయూ ఎక్కువగా చేస్తున్న 143 స్థానాల్లో ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రచారం నిర్వహించనున్నారు. తాను ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటికీ.. తన గుండెలో ప్రధాని మోదీ ఉంటారని ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆయన సిద్ధాంతాలు, అభివృద్ధి నమూనాను తాను నమ్మినప్పటికీ.. తాను ఎల్‌జేపీ పోస్టర్లలో ప్రధాని బొమ్మను వాడబోమని అన్నారు. తన పోస్టర్లలో ప్రధాని మోదీ బొమ్మను ఉపయోగించేందుకు సీఎం నితీష్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని చిరాగ్ అన్నారు. తనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. మోదీ ఇమేజ్ తనను కాపాడుతుందని ఆయన భావించి ఉండొచ్చని పాశ్వాన్ ఇటీవల వ్యాఖ్యానించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amit Shah, Bihar Assembly Elections 2020, Bjp, JDU

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు