రాహుల్ గాంధీకి మూడు ప్రశ్నలు సంధించిన అమిత్ షా

అమిత్ షా(File)

ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ డర్టీ ట్రిక్ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

 • Share this:
  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అమిత్ షా మూడు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మూడు ప్రశ్నలు సంధించారు. ఎవరో నలుగురైదుగురు చేసే పనులకు దేశం మొత్తాన్నీ బాధ్యులను చేయడం సరికాదని శామ్ పిట్రోడా అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా‌లో జైషే మహ్మద్ జరిపిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ తరుణంలో శామ్ పిట్రోడా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

  రాహుల్ గాంధీకి అమిత్ షా సంధించిన మూడు ప్రశ్నలు..

  1: శామ్ పిట్రోడా వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? క్రూరమైన పుల్వామా టెర్రర్ ఎటాక్‌ను కూడా రెగ్యులర్‌గా జరిగే ఘటనలానే చూస్తారా?

  2: ఎవరో కొందరు చేసే వ్యక్తులతో దేశానికి సంబంధం లేదని శ్యామ్ పిట్రోడా అన్నారు. భారత్‌లో ఉగ్రవాదానికి.. పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ దేశ మిలటరీకి సంబంధం లేదని రాహుల్ గాంధీ అంగీకరిస్తున్నారా? పాకిస్తాన్‌కు సంబంధం లేదని అంటే, దానికి బాధ్యులు ఎవరో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.

  3: టెర్రరిస్టులు దాడి చేస్తే దానికి సమాధానంగా శాంతి చర్చలు జరపాలి కానీ, సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్‌స్ట్రైక్స్ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో కాంగ్రెస్ పార్టీ పాలసీ ఇదేనా? అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా.

  ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ డర్టీ ట్రిక్ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి జాతి భద్రత కంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలే ముఖ్యమన్నారు. తమ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం భద్రతా బలగాలు, వారి కుటుంబాలను వాడుకోవడం ద్వారా వారిలో బాధను మరింత పెంచుతున్నారని అమిత్ షా అన్నారు.
  First published: