Home /News /national /

Amit Shah: ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి... డాక్టర్లు ఏం చెప్పారంటే...

Amit Shah: ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి... డాక్టర్లు ఏం చెప్పారంటే...

ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి (credit - twitter)

ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి (credit - twitter)

Amit Shah Discharged: అమిత్ షాకి కరోనా వచ్చి, పోయిన తర్వాత మళ్లీ ఆయన ఆస్పత్రిలో చేరడంతో... రకరకాల అనుమానాలు వచ్చాయి. అసలు ఆయన మళ్లీ ఎందుకు ఎయిమ్స్‌లో చేరారు?

    Amit Shah Discharged: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఆయన ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఆరోగ్యంగా ఉదయం డిశ్చార్జి అయ్యారు. నిజానికి 55 ఏళ్ల అమిత్ షాకి ఆగస్ట్ 2న కరోనా పాజిటివ్ వచ్చింది. దేశంలోని లక్షల మంది కరోనా పాజిటివ్‌లలో ఆయన కూడా చేరారు. ఆ తర్వాత గుర్గావ్‌లోని మేదాంత ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. తద్వారా కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నెగెటివ్ అయ్యారు. దాంతో డిశ్చార్జి అయ్యారు. ఆగస్ట్ 14న తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాననీ, కొన్ని రోజులు అలా ఉండమని డాక్టర్లు చెప్పారని ట్వీట్ చేశారు. ఐతే... డిశ్చార్జి అయ్యాక... అమిత్ షాకి... అలసట ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఎందుకిలా అయ్యిందో అర్థం కాలేదు. అన్ని రోజులు ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల అలా అయి ఉండొచ్చని అనుకుంటూ... మరోసారి ఆగస్ట్ 18న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. దీన్ని డాక్టర్లు పోస్ట్ కొవిడ్ కేర్ అని పిలిచారు. త్వరలోనే ఆయన కోలుకుంటారనీ, డిశ్చార్జి చేస్తామని అన్న డాక్టర్లు ఇవాళ డిశ్చార్జి చేసి... మాట నిలబెట్టుకున్నారు. డిశ్చార్జి సందర్భంగా షా... ఓనమ్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.


    ప్రజా ప్రతినిధులకు కరోనా సోకడం కామనైపోయింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంటి చాలా మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఎక్కువ కేసులున్నది ఇండియాలోనే. అదీ కాక... రోజువారీ ఎక్కువ కేసులు నమోదవుతున్నది ఇండియాలోనే. అందువల్ల ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Amit Shah

    తదుపరి వార్తలు