హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Big Announcement: అమిత్ షా బిగ్ అనౌన్స్ మెంట్..రిజర్వేషన్ పెంపుపై సంచలన హామీ

Big Announcement: అమిత్ షా బిగ్ అనౌన్స్ మెంట్..రిజర్వేషన్ పెంపుపై సంచలన హామీ

అమిత్ షా

అమిత్ షా

కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా జమ్మూకాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజౌరి పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Andhra Pradesh

  కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా (amit sha) జమ్మూకాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. మొత్తం 3 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా రాజౌరి పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 375 & 35A తొలగించకుంటే గిరిజన రిజర్వేషన్లు పొందడం సాధ్యమయ్యేనా అని పేర్కొన్నారు. ఇప్పుడు వాటి తొలగింపుతో జమ్మూకాశ్మీర్ లో పహారి, గుజ్జర్, బకర్వాల్ వంటి వర్గాలకు రిజర్వేషన్ (Reservation) కల్పిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

  ఈ రిజర్వేషన్ల అమలుకు ప్రధాని మోడీ (modi) సానుకూలంగా ఉన్నట్టు అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో దళితులకు, వెనకబడిన వారికీ రిజర్వేషన్ కల్పించే అవకాశం లభించిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే జమ్మూకాశ్మీర్ లో స్కాలర్ షిప్ లు పెంచాం, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశాం అని అమిత్ షా అన్నారు. రాజౌరి, పూంచ్, బారాముల్లా, హాంధర్వాలలో ప్రహరీలు భారీ సంఖ్యలో ఉన్నారు. దీన్ని ఓటు బ్యాంక్ గా మలుచుకోడానికి పహారీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే వారికీ ఎస్టీ హోదా కల్పించడంపై గుజ్జర్లు, బకెర్వాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

  ఇక అమిత్ షా పర్యటనకు ముందు  జమ్మూకాశ్మీర్ jammu kashmir జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సోమవారం రాత్రి ఉదయ్ వాలాలోని ఆయన ఇంట్లో గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ హత్య అనంతరం ఆ ఇంట్లో పని చేసే జసిర్ అనే వ్యక్తి కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అతనే ప్రధాన నిందుతుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ హత్యకు సంబంధించి PAFF అనే ఉగ్రవాద సంస్థ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మేము తలుచుకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా దాడి చేయగలం. మా స్పెషల్ స్క్వాడ్ ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇది చిరు కానుక అంటూ ప్రకటనలో పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు అధికారులు  మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: Amit Shah, Jammu kashmir, Narendra modi

  ఉత్తమ కథలు