హోమ్ /వార్తలు /జాతీయం /

ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు... ప్రచారానికి దూరంగా అల్కా లంబా...

ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు... ప్రచారానికి దూరంగా అల్కా లంబా...

అల్కా లంబా (Image : Facebook)

అల్కా లంబా (Image : Facebook)

Lok Sabha Election 2019 : అధికారిక కార్యక్రమాలకు తనను దూరంగా ఉంచుతున్నారన్న అల్కా లంబా... డిసెంబర్ నుంచీ ఆప్‌తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఢిల్లీ చాందినీచౌక్ నుంచీ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అల్కా లంబాకీ... ఆ పార్టీ హైకమాండ్‌కీ మధ్య దూరం రాన్రానూ పెరుగుతోంది. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందంటే... చివరకు ఆమె తాజా లోక్ సభ ఎన్నికల్లో... పార్టీ తరపున ప్రచారం చేయట్లేదని ప్రకటించారు. ప్రచారానికి సంబంధించి తాను హైకమాండ్‌కి చాలాసార్లు రిక్వెస్టులు పంపినా, అటు నుంచీ ఎలాంటి సమాధానమూ రాలేదని ఆమె అన్నారు. కావాలనే పార్టీ కార్యక్రమాలకు తనను దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు. నాలుగు నెలలుగా హైకమాండ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, అవకాశం ఇవ్వట్లేదని మండిపడ్డారు. ప్రస్తుతం పార్టీలోనే కొనసాగుతానన్న అల్కా లంబా... తన అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగనివ్వనని అన్నారు. తమ మధ్య గొడవల ప్రభావం ప్రజలపై పడకుండా చూసుకుంటానన్నారు.ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్... తనకూ పార్టీకీ మధ్య విబేధాల్ని సృష్టించారని ఆరోపించిన అల్కా లంబా... తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నిస్తున్నాననీ, కాంగ్రెస్ నుంచీ లోక్ సభ టికెట్ ఆశిస్తున్నాననీ లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రెండు నెలలుగా భరద్వాజ్, అల్కా లంబా మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది.


పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పైనా విమర్శలు చేశారు అల్కా లంబా. లోక్ సభ ఎన్నికలకు పార్టీ వాలంటీర్లు ప్రచారం చెయ్యాలని కేజ్రీవాల్ కోరడాన్ని బట్టీ... పార్టీ బలహీనపడిందన్న విషయం బయటపడుతోందన్నారు.


అల్కా లంబా కెరీర్ ప్రారంభమైనది కాంగ్రెస్ తోనే. స్టూడెంట్‌ వింగ్‌ నుంచీ కాంగ్రెస్‌కి 20 ఏళ్లపాటూ సేవలు అందించిన లంబా... 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి... 2015 ఎన్నికల్లో గెలిచి... ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.


 


ఇవి కూడా చదవండి :


తృటిలో తప్పిన ప్రమాదం... రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంజిన్ ట్రబుల్...


21,000 మంది సిబ్బంది... మే 23న భారీ భద్రత మధ్య ఏపీ ఎన్నికల లెక్కింపు...


ముస్లింలు ఉగ్రవాదులు కాదు... వారిని అలా చూడొద్దని కోరిన శ్రీలంక అధ్యక్షుడు...


తాగి వస్తున్న భర్తకు తిండి పెట్టడం మానేసింది... అతను ఏం చేశాడంటే...

First published:

Tags: AAP, Aravind Kejriwal, Arvind Kejriwal, Assem, Lok Sabha Election 2019

ఉత్తమ కథలు