కాశ్మీర్‌లో అదనపు సైన్యం రాకతో... డ్యూటీలను విరమించుకుంటున్న పోలీసులు

జమ్మూకాశ్మీర్‌లో రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే. భద్రత విషయంలో మాత్రం ఇన్నాళ్లూ గుళ్లు, మసీదులు, కోర్టులకు భద్రత కల్పించిన పోలీసులు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ల ప్లేస్‌లోకి అదనపు కేంద్ర బలగాలు వచ్చేశాయి. ఇంతకీ ఎందుకొచ్చాయి?

Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 10:36 AM IST
కాశ్మీర్‌లో అదనపు సైన్యం రాకతో... డ్యూటీలను విరమించుకుంటున్న పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Jammu and Kashmir : దక్షిణ కాశ్మీర్ సహా చాలా ప్రాంతాల్లో అదనపు కేంద్ర బలగాలు మోహరించాయి. అక్కడి మందిరాలు, మసీదులు, కోర్టులకు ప్రత్యేక భద్రత కల్పించడం మొదలుపెట్టాయి. ఎవరు ఎక్కడ భద్రత కల్పిస్తున్నది వెంటనే ఆయా జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వమని సైన్యానికి ఆదేశాలొచ్చాయి. అసలీ బలగాలు ఎందుకొచ్చాయన్నదానిపై కాశ్మీర్ లోయలో కలకలం ఉంది. ప్రజల్లో ఏవేవో అనుమానాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం ఉండగా ఇక మాతో పనేముంది అంటూ... చాలా మంది పోలీసులు... మసీదులు, కోర్టులు, మందిరాల నుంచీ తన డ్యూటీలను విరమించుకొని... తమ తమ స్టేషన్లకు వెళ్లిపోయారు. గురువారం మధ్యాహ్నం నుంచీ ఇలాంటి సీన్లు అక్కడ కనిపిస్తున్నాయి.

ఇన్నాళ్లూ కోర్టుల వద్ద ఉన్న పోలీసుల దగ్గర ఆయుధాలేవీ లేవు. ఎందుకంటే... ఆయుధాల్ని దొంగిలించే కుట్రలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. దాంతో ఆయుధాలు లేకుండా భద్రత కల్పించారు. ఇప్పుడు వాళ్లంతా వెనక్కి వెళ్లిపోతున్నారు. త్వరలోనే మొత్తం పోలీసులందర్నీ విత్ డ్రా చేసే అవకాశాలున్నాయి. అధికారికంగా మాత్రం... విత్ డ్రాపై ఎలాంటి ఆదేశాలూ లేవని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

వారం కిందటే 10 వేల మందితో కేంద్ర బలగాలు కాశ్మీర్ వచ్చాయి. మరో 25 వేల అదనపు బలగాల్ని లోయలోకి తెప్పించబోతున్నట్లు తెలిసింది. ఆర్టికల్ 35 A రద్దు దృష్ట్యా ఏర్పడే పరిణాలను ఎదుర్కొనేందుకే బలగాల్ని మోహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే 280 కంపెనీల బలగాలు... కాశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో మోహరించాయి. శ్రీనగర్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర సెంట్రల్ ఆర్మ్‌డ్ పారామిలిటరీ ఫోర్సెస్ (CAPFs) పహారా కాస్తున్నాయి. ప్రజలైతే ఏం కొనాలన్నా, బయటకు రావాలన్నా... తమను ఎక్కడ ఎవరు అరెస్టు చేస్తారోననే భయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

తాము అధికారంలోకి వస్తే, జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 35A, ఆర్టికల్ 370ని రద్దుచేస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రకటించింది. ఆర్టికల్ 35A ద్వారా జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక హోదా లభిస్తోంది. అలాగే ఆర్టికల్ 370 ద్వారా... భారత రాజ్యాంగం పరిధిని దాటి జమ్మూకాశ్మీర్ ఉంటోంది. దేశంలో చేసే చట్టాలు జమ్మూకాశ్మీర్‌కి వర్తించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా 10వేల అదనపు బలగాల్ని మోహరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>