హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Omicron : ప్రమాదకర ఒమిక్రాన్‌పై మోదీ సర్కార్ తాజా గైడ్‌లైన్స్ -కట్టడి బాధ్యత రాష్ట్రాలదే

Omicron : ప్రమాదకర ఒమిక్రాన్‌పై మోదీ సర్కార్ తాజా గైడ్‌లైన్స్ -కట్టడి బాధ్యత రాష్ట్రాలదే

ఒమిక్రాన్‌ చాలా దేశాలకు విస్తరించిందని.. మనదేశంలో బెంగళూరు, ముంబై, జైపూర్‌లోనూ కేసులు వచ్చాయని శ్రీనివాసరావు చెప్పారు. 

రేపో మాపో తెలంగాణలోనూ ఈ వేరియంట్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కరోనా మూడో వేవ్‌ వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో అన్ని 

రకాల ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నామన్నారు.

ఒమిక్రాన్‌ చాలా దేశాలకు విస్తరించిందని.. మనదేశంలో బెంగళూరు, ముంబై, జైపూర్‌లోనూ కేసులు వచ్చాయని శ్రీనివాసరావు చెప్పారు. రేపో మాపో తెలంగాణలోనూ ఈ వేరియంట్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కరోనా మూడో వేవ్‌ వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నామన్నారు.

రోగ నిరోధ‌క శ‌క్తి లేని వ్య‌క్తిలో దీర్ఘ‌కాలిక సంక్ర‌మ‌ణ ద్వారా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ (బి.1.1.529) కరోనా వైరస్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న దరిమిలా, బెంగళూరులో సౌతాఫ్రికా ప్రయాణికులను గుర్తించిన నేపథ్యంలో ఆ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. తాజా మార్గదర్శకాలు జారీ చేసింది..

ఇంకా చదవండి ...

రోగ నిరోధ‌క శ‌క్తి లేని వ్య‌క్తిలో దీర్ఘ‌కాలిక సంక్ర‌మ‌ణ ద్వారా పుట్టుకొచ్చిన  (బి.1.1.529) ఒమిక్రాన్ కరోనా వేరియంట్  (Omicron corona variant) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నది. ప్రమాదకారిగా భావించిన డెల్టా వేరియంట్కంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైన ఒమిక్రాన్ రకం కరోనా దెబ్బకు దేశదేశాలు మళ్లీ మూసివేత బాటపట్టాయి. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త రకం వేరియంట్.. ఇప్పటికే వందల మందిని పొట్టపెట్టుకుని, వాయివేగంతో వ్యాప్తి చెందుతున్నది. భారత్ లోనూ బెంగళూరు ఎయిర్ పోర్టులో సౌతాఫ్రికా నుంచి ప్రయాణించిన వారిలో ఒమెక్రాన్ గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఒమెక్రాన్ గనుక భారత్ లో వ్యాప్తిస్తే ఆ విలయం మాటలకు అందని స్థాయిలో ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని మోదీ (PM Modi) శనివారం నాడు కీలక సమీక్ష నిర్వహించారు. ఒమెక్రాన్ వ్యాప్తికి తావు లేకుండా కట్టడి చర్యలకు దిగాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదివారం నాడు లేఖలు రాసింది. కొత్త మహమ్మారి కట్టడి బాధ్యత రాష్ట్రాలదేనంటూ కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ ఆదివారం నాడు లేఖ‌లు రాశారు. అందులోనే తాజా మార్గదర్శకాలను పేర్కొన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఒమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ చేయాలని, అలాగే ఇంటెన్సివ్ కంటైన్మెంట్, పటిష్ట నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్టు గుర్తించామని, కాబట్టి కోవిడ్-19 పరీక్షలను పెంచాలని ఆదేశించారు.

sex doll : రెండో సెక్స్ డాల్ భార్యతో హనీమూన్ -ఆ దెబ్బకు మొదటి భార్య ఢమాల్ -వీడి ప్లాన్ మామూలుగా లేదు..


కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్‌ స్పాట్లుగా గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేయాలని, పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని కేంద్రం పేర్కొంది. గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలన్నారు.

Karimnagar mlc : బండి సంజయ్‌కి ఈటల పోటు.. bjpకి కొత్త అధ్యక్షుడు.. సర్దార్ రవీందర్ సింగ్ ఖేల్ ఖతమంటూకొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని కూడా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని చెప్పింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒమెక్రాన్ వేరియంట్ పై తప్పుడు సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని అందించాలని, ఒమెక్రాన్ పై నిరంతరాయంగా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని కేంద్రం సూచించింది.

Godavarikhani : ముక్కలుగా నరికి.. వీధికొకటి విసిరేసి.. మీసేవ ఆపరేటర్ దారుణహత్య.. భార్య పనేనా?సౌతాఫ్రికాలో గడిచిన కొద్ది నెలలుగా రోజుకు సగటున 200 కొత్త కేసులు వచ్చేవి. అలాంటిది, న‌వంబ‌ర్ 24 న‌ ఒక్క‌రోజే 1200 కొత్త కేసులు, ఆ మ‌రుస‌టి రోజు దానికి రెట్టింపు అంటే 2465 కేసులు రికార్డ‌య్యాయి. మ‌ర‌ణాలు కూడా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగాయి. దీంతో రంగంలోకి దిగిన శాస్త్ర‌వేత్త‌లు మూలాల‌ను వెతకగా, బి.1.1.529 కొత్త వేరియంట్‌ను గుర్తించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో అంటే ఎయిడ్స్ లాంటి రోగాలున్నవారి శరీరంలో దీర్ఘకాలిక సంక్రమణ ద్వారా ఒమిక్రాన్ రకం పుట్టుకొచ్చినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సౌతాఫ్రికా నుంచి ఈ వేరియంట్ బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ దేశాలకు వ్యాప్తి చెందింది. చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.

First published:

Tags: Covid, Omicron corona variant, Pm modi, Union government

ఉత్తమ కథలు