హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Omicron : ప్రమాదకర ఒమిక్రాన్‌పై PM Modi అలర్ట్ -అంతర్జాతీయ విమాన సర్వీసులు లేనట్టే!

Omicron : ప్రమాదకర ఒమిక్రాన్‌పై PM Modi అలర్ట్ -అంతర్జాతీయ విమాన సర్వీసులు లేనట్టే!

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రధాని మోదీ సమీక్ష

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రధాని మోదీ సమీక్ష

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న ఈ వేరియంట్ ఇండియాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు.

ఇంకా చదవండి ...

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’  (Omicron variant) పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హెచ్చరించారు. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న ఈ వేరియంట్ ఇండియాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకూ అది లొంగే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ (శనివారం) వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదపాు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో ఒమిక్రాన్ కట్టడికి సంబంధించి ప్రధాని పలు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాలివి..

దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా సహా పలు దేశాల్లో గుర్తించి ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తీవ్రత, దాని ప్రభావం వంటి అంశాలను అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. ఈ వేరియంట్ భారత్‌లో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారని పీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి ఒమెక్రాన్ వేరియంట్ విదేశాల్లోనే ఉన్నందున, భారత్ లోకి వచ్చే విదేశీ ప్రయాణికులు, విదేశీ ప్రయాణాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. విదేశాల నుంచి వచ్చి, పోయే ప్రయాణికులకు గతంలో మాదిరిగా టెస్టులు చేయాలని, కొత్త వేరియంట్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు,

shocking : మలద్వారం గుండా గాలిని పంప్ చేశారు -ఫ్యాక్టరీలో సరదాగా చేసిన పని చివరికిలా..ఒమెక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరిటా టెస్ట్ చేయాలని, వాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని ప్రధాని సూచించారు. అత్యంతక కీలకంగా.. విదేశీ విమాన సర్వీసుల పునరుద్ధరణపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 15 నుంచి విదేశీ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పున:ప్రారంభించబోతున్నట్లు భారత ప్రభుత్వం నిన్న స్పష్టం చేయడం, కొద్ది గంటల కిందటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమెక్రాన్ వేరియంట్ పై హెచ్చరికలు చేసిన నేపథ్యంలో విమాన విమాన సర్వీసుల పునరుద్ధరణ నిర్ణయంపై సమీక్ష జరపాలని అధికారులకు మోదీ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాలకు విమానాలు నడపాలా, వద్దా అనేది లోతుగా చర్చించాలని ఆచన వ్యాఖ్యానించారు. ప్రధాని రివ్యూ మీటింగ్ లో వెలిబుచ్చిన అభిప్రాయలు మీడియాలో వచ్చిన తర్వాత.. విమాన సర్వీసుల పున:ప్రారంభం ఇప్పట్లో లేనట్లేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

karimnagar mlc : టీఆర్ఎస్‌కు షాక్! -రెబల్ సర్దార్ రవీంద్ సింగ్‌ గెలుపు? -ఆయన చెప్పినవన్నీ జరిగాయి మరి!!డెల్టా కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ ఇప్పటికే సౌతాఫ్రికాతోపాటు బోట్సువానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్, డెన్మార్క్ దేశాలకు వ్యాపించింది. దీంతో అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు యూరప్ దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపేశాయి. సెకండ్ వేవ్ లో బాగా దెబ్బ తిన్న భారత్ మరోసారి ఛాన్స్ తీసుకోరాదని, ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వద్దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే స్వయంగా ప్రధాని మోదీనే విమాన సర్వీసులపై నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలనడం పరిస్థితిలో తీవ్రతకు అద్దంపడుతున్నది. మరోవైపు,

Home loan : హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. రీపేమెంట్ బాధ్యత ఎవరిది? బీమా వర్తిస్తుందా?కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, ఆ మేరకు హెచ్చరికలు జారీ చేయాల్సిందిగా అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కొత్త వేరియంట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడంతో పాటు ఇంకా కేసులు భారీగా వస్తున్న ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అవగాహన పెంచాలన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం సహా అన్ని జాగ్రత్తలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పైనా నిర్దేశం చేసిన ప్రధాని.. ఇంటింటికీ వ్యాక్సిన్లు అందించే ‘హర్ ఘర్ దస్కత్‌’ కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

Published by:Madhu Kota
First published:

Tags: Airlines, Covid, Flight, Pm modi

ఉత్తమ కథలు