Home /News /national /

AMID LAKHIMPUR KHERI VIOLENCE UP GOVT OFFERS RS 45 LAKH COMPENSATION TO DEAD FARMERS FAMILIES MOS DEMANDS RS50LACK FOR BJP WORKERS TOO MKS

UP Violence: ఒక్కో రైతు ప్రాణానికి రూ45లక్షలు -Lakhimpurపై యోగి సర్కార్ దిద్దుబాట -బీజేపీ నేతలకూ రూ.50లక్షలంటూ కేంద్ర మంత్రి మెలిక

లఖింపూర్ హింసపై యోగి సర్కార్ ప్రకటన

లఖింపూర్ హింసపై యోగి సర్కార్ ప్రకటన

Lakhimpur Kheri News Updates | సాగు చట్టాలపై నిరసన చేస్తోన్న రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకుపై యూపీ పోలీసులు మర్డర్ కేసు పెట్టారు. నిరసనల్ని చల్లార్చే దిశగా, చనిపోయిన రైతుల కుటుంబాలకు యోగి సర్కారు రూ.45లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఘటనపై రిటైర్డ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయిస్తామని మాటిచ్చింది. బాధితులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు..

ఇంకా చదవండి ...
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలో రైతులపై హత్యాకాండ విషయంలో యోగి సర్కారు ఆచితూచి వ్యవహరిస్తున్నది. సాగు చట్టాలపై నిరసన తెలుపుతోన్న రైతులపైకి కారును పోనిచ్చి హింసకు పాల్పడిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదు చేసిన యూపీ సర్కారు.. తాజాగా బాధిత కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి బాధితులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, హింసలో చనిపోయిన బీజేపీ కార్యక్తలకు కూడా భారీ పరిహారం ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి మిశ్రా డిమాండ్ చేస్తున్నారు. వివరాలివి..

యూపీలోని లఖింపూర్ జిల్లాలో ఆదివారం నాడు రైతులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఇలా అన్ని విపక్షాలు రోడ్లపై నిరసనలకు దిగాయి. లఖింపూర్ జిల్లా అంతటా 144 సెక్షన్ విధించి పోలీసులు.. రాజకీయ నేతలను అటువైపునకు అనుమతించడంలేదు. పోస్ట్ మార్టం అనంతరం చనిపోయిన రైతుల మృతదేహాలతో వారి కుటుంబీకులు, రైతుల సంఘాల నేతలు లఖింపూర్ రోడ్లపైనే ధర్నాకు దిగారు. వారిని ఒప్పించి, అంత్యక్రియలు పూర్తి చేయించేలా ప్రభుత్వాధికారులు మంతనాలు జరుపుతున్నారు. ఈక్రమంలోనే..

లఖింపూర్ ఖేరి జిల్లాలో చోటుచేసుకున్న హింసలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు తలా రూ.45లక్షల నష్ట పరిహరం ప్రకటించింది. అంతేకాదు, రిటైర్డ్ హైకోర్టు జడ్జిచేత న్యాయ విచారణ కూడా జరిపిస్తామని తెలిపిది. సోమవారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ పోలీస్ ఏజీడీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ ప్రతిపాదనలతో ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఒకటి బాధిత కుటుంబాలను కలిసి చర్చలు జరుపుతున్నది. బాధితులు మాత్రం.. నిందితులను అరెస్టు చేయాలని, కేంద్ర మంత్రి మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం మౌర్యలు రాజీనామా చేసేదాకా నిరసనలు ఆపబోమని నినదిస్తున్నారు. కాగా,

తికూనియా గ్రామం(లఖింపూర్ జిల్లా)లో ఆదివారం నాటి హింసలో మరణించినవారి సంఖ్య 9కి పెరిగింది. వీరిలో నలుగురు రైతులు కాగా, మిగతా ఐదుగురు కేంద్ర మంత్రి మిశ్రా అనుచరులైన బీజేపీ కార్యకర్తలు. హింసతో తన కొడుక్కి సంబంధం లేదన్న మంత్రి మిశ్రా.. నిజంగా తన కొడుకే గనుక అక్కడుంటే కచ్చితంగా హత్యకు గురై ఉండేవాడని వ్యాఖ్యానించారు. చనిపోయిన రైతులకు ఇచ్చినట్లే, ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తలకు కూడా రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి మిశ్రా డిమాండ్ చేశారు. యూపీలో ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రైతులపై హింస, అనంతర పరిణామాలపై యోగి సర్కారు అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది.
Published by:Madhu Kota
First published:

Tags: Farmers Protest, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు