కర్ణాటకలో యెడియూరప్ప ప్రభుత్వానికి మరో గండం...ముదురుతున్న ముసలం...

యెడియూరప్పకు వ్యతిరేకంగా అసంతృప్తి లేవనెత్తుతున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఉత్తర కర్ణాటకకు చెందినవారు. వీరంతా ఎమ్మెల్యే ఉమేష్ కత్తికి మద్దతుగా ఉన్నారు.

news18-telugu
Updated: May 29, 2020, 1:40 PM IST
కర్ణాటకలో యెడియూరప్ప ప్రభుత్వానికి మరో గండం...ముదురుతున్న ముసలం...
యడ్యూరప్ప
  • Share this:
దేశం మొత్తం ప్రస్తుతం కరోనావైరస్ పై యుద్ధం చేస్తోంది. అటు కర్ణాటకలో ప్రతిరోజూ రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలావుండగా, కరోనాతో యుద్ధం చేస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్పకు అటు పొలిటికల్ గా కూడా కష్టాలు పెరిగాయి. సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో కర్ణాటకలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు ఉన్నాయి.

అసలు విషయం ఏమిటి?

యెడియూరప్పకు వ్యతిరేకంగా అసంతృప్తి లేవనెత్తుతున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఉత్తర కర్ణాటకకు చెందినవారు. వీరంతా ఎమ్మెల్యే ఉమేష్ కత్తికి మద్దతుగా ఉన్నారు. కత్తి బెల్గాం జిల్లాకు చెందిన శక్తివంతమైన లింగాయత్ నాయకుడు. గురువారం ఆయన సుమారు 20 మంది ఎమ్మెల్యేలను విందుకు ఆహ్వానించారు. అయితే, ఈ విందు గురించి పార్టీ పెద్దలకు ఎలాంటి సమాచారం లేదు. అలాగే సమావేశం గురించి ఎవరూ అధికారికంగా మాట్లాడటం లేదు. అయితే ఈ ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రిపై గుర్రుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

తిరుగుబాటుకు దారితీసే కారణాలు ఇవే...
> ఎమ్మెల్యే ఉమేష్ కత్తి సహా మిగిలిన శాసనసభ్యులు యెడ్యూరప్ప తన పనితీరును మార్చాలని కోరుతున్నారు.

> యడ్యూరప్పకు చెందిన ఎమ్మెల్యే ఉమేష్ కత్తిని కేబినెట్ మంత్రిగా చేయాలని కోరుతున్నారు. కత్తి ఇప్పటికే 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

> ఇంతేకాదు ఉమేష్ కత్తి సోదరుడు రమేష్ ను రాజ్యసభకు పంపించాలన్నది మరో డిమాండ్.యడ్యూరప్ప శిబిరంలో ఆందోళన...
ఇదిలాఉంటే, బిఎస్ యెడియూరప్ప ఉమేష్ కత్తిని సమావేశానికి పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు, తాజా పరిణామాలపై కూడా సమాధానాలు అడిగారు. మరోవైపు యెడియూరప్ప మరో లింగాయత్ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి బిఆర్ పాటిల్ యత్నాల్ పై గుర్రుగా ఉన్నారు. అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని యడ్యూరప్ప భావిస్తున్నట్లు సమాచారం. అయితే, యడ్యూరప్ప మద్దతుదారులు తాజా రాజకీయ పరిణామాలను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. యడ్యూరప్ప ప్రభుత్వం పూర్తిగా సురక్షితమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
First published: May 29, 2020, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading