ఆర్టీఐ చట్టాన్ని మోడీ భ్రష్టుపట్టిస్తున్నారు..!

ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్ర భావిస్తోంది. ఐతే దాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు వ్యూహం రచిస్తున్నాయి.

news18-telugu
Updated: July 19, 2018, 1:56 PM IST
ఆర్టీఐ చట్టాన్ని మోడీ భ్రష్టుపట్టిస్తున్నారు..!
రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
  • Share this:
ఆర్టీఐ చట్టానికి సవరణ చేయాలన్న కేంద్రం ప్రతిపాదనపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాచార కమిషనర్ల హోదా, వేతనం, పదవీకాలాన్ని ఫిక్స్ చేసే అధికారం కేంద్రం చేతుల్లో ఉంటే .. ఆర్టీఐ చట్టంలో పారదర్శకత లోపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగితే ఆర్టీఐ యాక్ట్ పనికిరాకుండా పోతుందని ట్విటర్‌లో మండిపడ్డారు. నిజాలను తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడి ఉందని.. కానీ బీజేపీ మాత్రం నిజాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు రాహుల్.

కాగా, ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్ర భావిస్తోంది. ఎలక్షన్ కమిషనర్ల మాదిరే కేంద్ర , రాష్ట్రాల్లోని సమాచార కమిషనర్ల హోదా, వేతన, పదవీ కాలంలో మార్పులు చేసే అధికారం కేంద్రానికి ఉండాలని ప్రతిపాదించింది. అంటే వాళ్ల పదవీకాలాన్ని ఐదేళ్ల తర్వాత కూడా కొనసాగించవచ్చు. లేదంటే అంతకు ముందే పదవి నుంచి తొలగించవచ్చు. తీసేయవచ్చు. ఐతే ఇలా జరిగితే  RTI చట్టంలో పారదర్శకత లోపిస్తుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  చట్ట సభల్లో సవరణ బిల్లును ప్రవేశపెడితే అడ్డుకోవాలని యోచిస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: July 19, 2018, 1:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading