15 రోజుల చిన్నారిని అంబులెన్స్‌లో తరలింపు... ఫేస్‌బుక్‌లో లైవ్ ఎందుకు ఇచ్చారు...

Karnataka News : అంబులెన్స్ వస్తుంటే మనమంతా దారి ఇచ్చేస్తాం. అది మన మానవత్వం. మంగళూరులో అదే జరిగింది. ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 17, 2019, 11:04 AM IST
15 రోజుల చిన్నారిని అంబులెన్స్‌లో తరలింపు... ఫేస్‌బుక్‌లో లైవ్ ఎందుకు ఇచ్చారు...
మంగళూరులో అంబులెన్స్
  • Share this:
మృత్యువుతో పోరాడుతున్నఆ చిన్నారికి కాలంతో పోటీ పడాల్సిన సమయం. కేరళ మొత్తం ఆ 15 రోజుల పసికందు కోసం ప్రార్థించింది. కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఆ చిట్టితల్లిని కేరళలోని కొచ్చికి తరలించాల్సి ఉంది. మొత్తం 400 కిలోమీటర్ల దూరం. ఉదయం 11 గంటలకు బయలుదేరిన అంబులెన్స్... సాయంత్రం 4.30కి కొచ్చీ చేరింది. అంబులెన్స్ ప్రయాణించిన జర్నీ మొత్తాన్నీ ఫేస్‌బుక్‌లో లైవ్ ఇచ్చారు. తద్వారా అంబులెన్స్ వస్తుందని తెలుసుకున్న ప్రజలు ఎక్కడికక్కడ ముందుగానే దాని కోసం దారి ఏర్పాటు చేశారు. ఆ చిన్నారికి అర్జెంటుగా హార్ట్ వాల్వ్ సర్జరీ చెయ్యాల్సి వచ్చింది. మామూలుగా అయితే... ఏ హెలికాప్టర్‌లోనో చిన్నారిని నిమిషాల్లో తరలించవచ్చు. ఐతే... అందుకు డాక్టర్లు ఒప్పుకోలేదు. హెలికాప్టర్‌లో తీసుకెళ్తే... గాలి ఒత్తిళ్ల ప్రభావం చిన్నారిపై పడి... ప్రాణాలకే ప్రమాదం అన్నారు. దాంతో అంబులెన్స్‌లోనే పాపను తరలించాల్సి వచ్చింది.


ఈ విషయం తెలుసుకున్న చాలా మంది స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి... అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా దారి ఏర్పాటు చేశారు. చైల్డ్ ప్రొటెక్ట్ టీం అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు కూడా సహకారం అందించారు. మామూలుగా అయితే ఆ అంబులెన్స్ 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అందుకు 16 గంటల సమయం పట్టేది. కానీ ప్రజలు సహకరించడంతో అంబులెన్స్ అడ్డదారుల్లో 400 కిలోమీటర్లు ప్రయాణించి... జస్ట్ 5న్నర గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరింది.

అటు కర్ణాటక, ఇటు కేరళ ప్రభుత్వాలు స్పందించాయి. ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చాయి. అంతే... ప్రజలంతా ఒక్కటయ్యారు. ఆ పసికందుకు ప్రాణం పొయ్యాలని నిర్ణయించుకున్నారు. సానియా, మితాలకు జన్మించిన ఆ చిట్టితల్లికి వారం నుంచీ మంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇంతలో కండీషన్ క్రిటికల్ అవ్వడంతో... కొచ్చిలోని మరో ఆస్పత్రికి తరలించి, ప్రాణాలు కాపాడారు. 

ఇవి కూడా చదవండి :

నన్ను సుఖపెట్టు... అవకాశాలిస్తా... టీవీ నటి రిచా భాద్రాకు వేధింపులు

నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం... రోజువారీ ఖర్చులకే డబ్బుల్లేవట...

జెట్ ఎయిర్‌వేస్ మూతపడుతుందా... మరింత ముదిరిన సంక్షోభం.


ఏపీలో నేమ్ ప్లేట్ చుట్టూ రాజకీయాలు... రాసిందెవరు... చేసిందెవరు...
First published: April 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు