Home /News /national /

AMBULANCE DRIVER GOT ONE CRORE LOTTERY TICKET IN WEST BENGAL VRY

Lottery ticket : డ్రైవర్‌కు లాటరీ తగిలింది... అంతే... రోజంతా పోలీసుల ప్రోటెక్షన్.. !

Lottery ticket

Lottery ticket

Lottery ticket : ఓ అంబులెన్స్ డ్రైవర్‌కు లాటరీ తగిలితే.. దాన్ని కాపాడుకునేందుకు ఓ రోజంతా... పోలీసుల ప్రొటెక్షన్‌ తీసుకున్నాడు.. ఆ మరునాడు వెళ్లి లాటరీ డబ్బులు తీసుకుని వచ్చాడు. వాటితో ఓ ఇళ్లు కట్టుకోవడంతో పాటు తన తల్లికి చికిత్స అందిస్తానని చెబుతున్నాడు.

ఇంకా చదవండి ...
    ఓ అంబులెన్స్ డ్రైవర్‌కు లాటరీ తగిలితే.. దాన్ని కాపాడుకునేందుకు ఓ రోజంతా... పోలీసుల ప్రొటెక్షన్‌ తీసుకున్నాడు.. ఆ మరునాడు వెళ్లి లాటరీ డబ్బులు తీసుకుని వచ్చాడు. వాటితో ఓ ఇళ్లు కట్టుకోవడంతో పాటు తన తల్లికి చికిత్స అందిస్తానని చెబుతున్నాడు.

    రోజు లాటరీ టికెట్‌లు కొనుగోలు చేసే ఓ ఆంబులెన్స్ డ్రైవర్ ఎప్పటిలాగే.. ఓ రోజు ఉదయం లాటరీ కొనుగోలు చేశాడు.. మధ్యాహ్నమే ఆయనకు అనుకున్నట్టుగా కోటి రూపాయల లాటరీ తగిలింది.కాని ఆ లాటరీ టికెట్‌ను కాపాడుకునేందుకు ఏకంగా పోలీసు ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కల్గింది.

    వివరాల్లోకి వెళితే... వెస్ట్ బెంగాల్‌, ( West bengal ) ఈస్ట్ బార్ధామాన్ జిల్లాకు చెందిన షేక్ హీరా ఆంబులెన్స్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తాడు..కాగా ఆయన అప్పుడప్పుడు లాటరీ టికెట్ కొంటూ ఉండేవాడు. ఇలా ఒకరోజు రూ.270 పెట్టి లాటరీ టికెట్ ( Lottery ticket ) కొన్నాడు. ఉదయం టికెట్ కొన్నాడు.. మధ్యాహ్నానికి దాని ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో అతడి లాటరీ టికెట్‌కు కోటి రూపాయలు గెలుచుకున్నాడు.

    Omicron alert : అవసరమైతే... నైట్ కర్ఫ్యూ పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..నోట్..


    దీంతో తబ్బిబ్బయిన షేక్ హీరాకు ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. దీంతో తనకు కోటి రూపాయలు రావడంతో భయాందోళనలు మొదలయ్యాయి. తన లాటరీ టికెట్‌ను కాపాడుకునేందుకు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తనకు సెక్యూరిటీ కావాలని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు సైతం అతడిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లి.. తన ఇంటి వద్ద పోలీసులను కాపలా పెట్టారు.

    తెల్లారి వెంటనే లాటరీ టికెట్ ఇచ్చి కోటీ రూపాయలు తెచ్చుకున్నాడు.కాగా అనుకోకుండా వచ్చిన డబ్బులతో ఆయన మంచి ప్రయోజనమే కల్గింది. అప్పటికే తన తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడతో చాలా డబ్బులు కావాల్సి వచ్చింది. దీంతో ఆమె చికిత్స కోసం డబ్బులను కూడగట్టెందుకు తిరుగుతున్న సమయంలోనే లాటరీ తగలడంతో ఆయన కష్టాలు తీరాయాని చెప్పాడు. ఇక తల్లికి చికిత్సకు పోను మిగతా డబ్బులతో ఓ ఇళ్లు కొనుగోలు చేస్తానని చెప్పాడు. మొత్తానికి అంబులెన్స్ డ్రైవర్ కాస్త కోటీశ్వరుడు కావడంతో అక్కడి స్థానికులు అతడిని ఆశ్చర్యంగా చూడటం మొదలు పెట్టారు.

    Revanthreddy : అమర వీరుల స్థూపం నిర్మాణంలో అక్రమాలు... అమరుల స్థూపం నిర్మాణం ఆంధ్రా కాంట్రాక్టర్లకు... ? ఆందుకే ఆలస్యం


    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Drivers, Kerala Lottery, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు