అంబేద్కర్ విగ్రహంపై కాషాయ వస్త్రం..!

Shiva Kumar Addula | news18india
Updated: June 6, 2018, 2:54 PM IST
అంబేద్కర్ విగ్రహంపై కాషాయ వస్త్రం..!
  • Share this:
సీతా దేవీపై యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ వివాదాస్ప వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగానే...  బీజేపీ ఎమ్మెల్యే సంజూ దేవీ మరో వివాదానికి తెరలేపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్  విగ్రహానికి పాలాభిషేకం చేసి.. అనంతరం కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఈ చర్యపై బీఎస్పీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

టాండా ఎమ్మెల్యే సంజూ దేవి అంబేద్కర్ నగర్‌లోని అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. మంత్రోచ్ఛరణలతో పాలాభిషేకం చేశారు. అంత వరకు బాగానే ఉన్నా .. ఆ తర్వాత విగ్రహానికి కాషాయ వస్త్రాన్ని కప్పడం వివాదాస్పదమైంది.

సంజూదేవీ తీరుపై బీఎస్పీ మాజీ ఎంపీ త్రిభువన్ దత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంబేద్కర్ విధానాలు, ఆశయాలకు బీజేపీ విరుద్ధమని.. ప్రచారం కోసం బీజేపీ నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని విమర్శించారు. ఐతే ఆయన విమర్శలను సంజూ దేవీ తిప్పికొట్టారు. కషాయ వస్త్రాన్ని ఏ ఒక్క పార్టీకో అంటగట్టడం సరికాదన్నారు. దాన్ని మామూలు రంగుగానే భావించాలని అన్నారు.

కాగా, గత ఏప్రిల్‌లో బదుయాన్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దాని స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేసిన జిల్లా అధికారులు.. విగ్రహానికి కాషాయం రంగు వేశారు. దీనిపై బీఎస్పీ సహా పలు పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి నీలి రంగు వేశారు.
Published by: Shiva Kumar Addula
First published: June 1, 2018, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading