Ambedkar Jayanti: అంబేడ్కర్.. మళ్లీ ఎప్పుడు పుడుతావ్‌ తండ్రీ?

Ambedkar Jayanti: అంబేడ్కర్.. మళ్లీ ఎప్పుడు పుడుతావ్‌ తండ్రీ? (Image: Getty Images)

Babasaheb Ambedkar Birth Anniversary | భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

 • Share this:
  ‘జయంతునాడు వచ్చినవాడు వర్థంతునాడే కనిపిస్తాడని సామెత!’ ఇప్పుడు మీ విషయంలో అదే జరుగుతుంది బాబాసాహెబ్‌! మీ జయంతి, వర్థంతి వేడుకకు కూడా అదే రీతిగా మారిపోయాయి మహాత్మా అంబేద్కరా!! 129 ఏళ్ల క్రితం మీరు పుట్టిన ఏఫ్రిల్‌ 14 ప్రతీ ఏటా మాకు ఓ వేడుక. మీరు  భౌతికంగా మాకు దూరమైన డిసెంబర్‌ 6ను కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలకు, రాజకీయనాయకులకు ఈరెండూ పండుగ రోజుగా మారిపోయాయి. మాకూ అలాగే తయారయ్యాయి. కొందరైతే వాటిని ఎందుకు జరుపుకుంటున్నారో, సందర్భమేంటో కూడా తెలియకుండా జరుపుకుంటున్నారు. జయంతిని వర్థంతి అంటారు...వర్థంతిని జయంతి అంటారు. ఏదన్నా మీ కోసమేనంటారు. మాగురించి ఎప్పుడూ మాట్లడని వాళ్లూ ఈ రెండు రోజు తెగమాట్లాడేస్తారు. అసలు మీకోసమే మా జీవితం, పరిపాలన అన్నట్లుగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు.

  specail article on baba saheb ambedkar on his 62nd death anniversary
  (Image: Getty Images)


  మిమ్మల్ని ఒకనాడు దేశద్రోహి అన్నవాళ్లకు మీరిప్పుడు దేశభక్తుడుగా కనిపిస్తున్నారు.. అంటరానివాడు అన్నవాళ్లకూ ఆరాధ్యదైవమయ్యారు. ఏమైనా అందరి నోళ్లలో అంబేద్కర్‌ ఆలాపనే!  ఏం చేస్తాం! కమ్యూనిస్టు నుంచి హిందుత్వవాది దాకా అందిరికీ ఇప్పుడు మీ అవసరమే మరీ! అందుకే మిమ్మల్ని ఓన్‌ చేసుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘అలాంటి వారంతా నా వేడుకకు ఘనంగా చేస్తున్నారు మరీ నావారసుగా మీరేం చేస్తున్నారు నాకోసం?’ అని మాత్రం అడగకండి. ఎందుకంటే మిమ్మల్ని మేం ఎప్పుడో మరిచిపోయాం. ఒక్క ఫొటోకు దండేసి దండం పెట్టడం.. ఊరూరా, వీధివీధినా మీ విగ్రహాు ప్రతిష్ఠించడం తప్ప. అసు మీరు మాకోసమే పుట్టారని మేం గుర్తుంచుకుంటేగదా! మిమ్మల్ని స్మరించుకోవడానికి..మీరు మాకోసమే జీవితాన్ని ధారపోశారని తెలిస్తే కదా మీ ఆశయాలను కొనసాగించడానికి! విశ్వాసం ఉంటే కదా...మాకు జీవితాన్ని ప్రసాదించిన అంబేద్కర్‌ మా దైవమని కొవడానికి! అదేంటో, సంపన్నవర్గాలకు మిమ్మల్ని చదివితే ఎక్కడాలేని ధైర్యమొస్తుందంటారు. మరి, ఆ ధైర్యం తెచ్చుకోడానికి మేమేందుకు మిమ్మల్ని చదువలేకపోతున్నామో! అలా మీరిచ్చిన ‘ధైర్యం’తో మిమ్మల్ని అసెంబ్లీ ఆవరణల్లో,  నడిరోడ్లమీద ప్రతిష్ఠించినవారినే మా జీవితాంతం గుర్తించుకుంటున్నాం..తప్ప మాకు జీవితాలిచ్చిన మిమ్మల్ని కాదు. ఇంతకంటే ఇంకేం కృతజ్ఞత కావాలి?!

  హిందుత్వ వ్యవస్థ మనుధర్మ శాసనాలకు బలై..మూతికి ముంత, నడుముకు చీపురు..ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్లు.. జంతువుగా కూడా బతుకలేని మాకు... బతుకంటే ఏంటో చూపించి సమసమాజంలో ఆత్మగౌరవంతో జీవించేందుకు రాచబాటు వేసిన మీకు... మీ ఆశయాు, ఆదర్శాకు మ్లుబాటు వేశాం. మనిషిని మనిషిగా కూడా చూడలేని ఏ సమాజానికి వ్యతిరేకంగా తుదికంటా  పోరాడారో..ఇప్పుడదే వ్యవస్థలో హైందవ హిందూసమాజంతో అంటకాగిపోతున్నాం. మీరు లేని ఈ 62ఏళ్ల కాంలో దేశంలో చాలా మార్పు వచ్చాయి. కులానికో సంఘం, రాజకీయపార్టీ పుట్టుకొచ్చాయి. సంపన్న కులాలు ఎన్ని పార్టీలు పెట్టినా అధికారం అన్నది చేజారిపోకుండా ఉండేందుకు, అవసరమైనప్పుడు ఒకటవుతున్నాయి. మేం కూడా వాళ్లలాగే పార్టీలు, సంఘాలు పెడుతున్నాం. కానీ అధికారం అటుంచి మాకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఒక్కటిగా నిబడలేకపోతున్నాం. పైగా మాలోని ఒక్కోగ్రూపు ఒక్కోసారి ఒక్కో ఆధిపత్య కులానికి వత్తాసు పలుకుతూ వారి అడుగుల్లో అడుగేస్తూ వారినే అందమెక్కించడానికి ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటున్నాం.  ఇలా ఎవరికి పడితే వారికి అడుగుకు మడుగులొత్తుతున్నాం కాబట్టే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, పోయినా మా బతుకు మాత్రం ఏవిధంగానూ మారడం లేదు. ఏవీ కూడా మీపేరు చెప్పకుండా పుట్టని పార్టీ, సంఘం లేదంటే అతిశయోక్తిలేదు. పేరుకు అందరిది మీ(మా)మాటే..మీ(మా)పాటే.. ఆచరణలో మాత్రం దోపిడి, సంకుచిత స్వార్థ స్వభావాలే..  మీరు చెప్పిన ఐక్యతను పక్కనబెట్టి విడివిడిగా మీ పేరుతో ఇలా రోజుకో గ్రూపు మాలోనుంచి కూడా పుట్టుకొస్తుంటే దీన్ని చైతన్యమనాలో..అవివేకమనాలో అర్థంచేసుకోని పరిస్థితుల్లో ఉన్నాం.


  specail article on baba saheb ambedkar on his 62nd death anniversary
  (Image: Getty Images)


  దేశవిదేశ రాజ్యాంగాలను తిరగేసి ప్రపంచంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలన్నింటికి ఆదర్శంగా నిలిచిన రాజ్యాంగాన్ని తమకు అనుకూంగా మార్చుకుంటున్నాయీ ప్రభుత్వాలు. మీరు ప్రసాదించిన హక్కు, అవకాశాలు రాజ్యాంగం అమలైన ఇన్నేళ్లలో ఏవీసరిగ్గా, చట్టబధ్దంగా అమలుకు నోచుకోలేదు. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వర్గాలతో మేం పోటీపడలేమని అందుకు రిజర్వేషన్లు కల్పించారు. ఇవి కేవలం ఊతకర్రని, ప్రభుత్వాలు వీటిని చిత్తశుద్ధితో అమలు చేస్తే వీటి అవసరం రాదన్నారు. స్వార్థబుద్ధి, రాజకీయాలు ఆరుదశబ్ధాలు పూర్తయినా అవి సక్రమంగా అమలుకావడం లేదు. అమలైనవి కూడా అందాల్సిన వారికి అందకుండా పోతున్నాయి. మాలో కూడా అందుకున్నవాళ్లే అనుభవిస్తూ..అత్యంత వెనుకబడినవాళ్లకు ఆ‘ఊతకర్ర’ను ఇవ్వకుండా మాతోపాటే దాచుకుంటున్నాం. ఫలితంగా మాలోకూడా అంటరానివాళ్లలోనే అంటరానివాళ్లు పుట్టుకొస్తున్నారు. ‘నేను నా జీవితాంతం పోరాడి సాధించిన ఫలాలను కేవలం కొంతమంది మాత్రమే అనుభవిస్తూ వాటిని తోటి అట్టడుగు సమాజానికి అందకుండా అడ్డుకుంటున్నారని’ మీరు ఎన్నోసార్లు ఆవేదన చెందారు. మేం మాత్రం మాకంటే వెనుకబడినవాళ్లకు చేయందించి ఆదుకోవాల్సిందిపోయి చెయ్యిస్తున్నాం. వారిని మాస్థాయికి రాకుండా స్వార్థంతో అడ్డుకుంటున్నాం. ఫలితంగా మీరు ఇచ్చిన వాటా, కోటాల్లో కుమ్ములాటలు మొదయ్యాయి. ఆ కొట్లాటల్లోనూ అనుభవించి అనుభవించబపడ్డవాళ్లదే పైచేయి. అందుకే చమర్‌, మహార్‌, మాల, మాదిగంటూ మామధ్యే గోడు, ఎన్నిటికీ తేని గొడమ. ఇంకా ఎక్కువగా మాట్లాడితే  మాకిచ్చే అవకాశాల పరిధిని పెంచాలని పోరాడుతున్నాం కానీ అందరం సమానంగా పంచుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నాం.

  చివరికి రిజర్వేషన్లు అనేవి లేకపోతే మాకు బతుకు లేవన్నపరిస్థితి కొచ్చేశాం! ఎంతటి భావ దారిద్య్రం ఇది సాహెబ్‌!! మీరిచ్చిన అవకాశంతోనే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి గొప్పగొప్ప చదువు చదుకుంటున్నాం. మేధావుల్లా చలామణి అవుతున్నాం. అయినా సంకుచిత బుద్ధిని వీడటంలేదు. పెద్దపెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నాం. అద్దాల మేడల్లో ఉంటూ ఖరీదైన కార్లల్లో తిరుగుతున్నాం. అయినా స్వార్ధాన్ని మాత్రం వీడటం లేదు. రాజకీయ రిజర్వేషన్లతో రాజ్యాలే ఏలుతున్నాం. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పదవులను అనుభవిస్తున్నాం. అయినా మా జీవితాల్లో మార్పు రావడం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన సమాజాన్ని మరిచిపోయాం కాబట్టి. ఎన్నిక సమయంలో అధికారికంగా అఫిడవిట్లో సమర్పించే లెక్కల్లో కూడా అక్కడక్కడా మనవాళ్లే ముందున్నారు. కానీ ఏం లాభం ‘అదిగో మావాడు కోట్లు సంపాదించాడు’ అని గర్వంగా చెప్పుకునేంత పనులేం చేయడంలేదు వారు. ఎందుకంటే వారింకా చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్నట్లుగా జాతి పేరు చెప్పుకొనే బాగుపడుతున్నారు. వారు సంపాదించిన సందలో కనీసం పదిశాతం కూడా తమ జాతికోసం ఖర్చుపెట్టకుండా మీరు బోధించిన ‘పే బ్యాక్‌ టుది సొసైటి’కి తూట్లు పొడుస్తున్నారు. మీరు బతికుంటే వీళ్లను చూసి ఖచ్చితంగా నియో బ్రాహ్మణునో, దళిత బ్రాహ్మణునో బాధతో తిట్టిపోసేవాళ్లు! వీళ్ల విపరీత బుద్ధు చూసి..చెప్పేనీతు విని ఖచ్చితంగా ఈసడిరచుకునేవారే!!

  specail article on baba saheb ambedkar on his 62nd death anniversary
  (Image: Getty Images)


  సర్వసమస్యలకు పరిష్కారమని మీరు చెప్పిన రాజ్యాధికార ‘మాస్టర్‌ కీ’ని ఎప్పుడో పోగొట్టుకున్నాం. మేం కూడా ‘అధికార వర్గాల్లా’గే పూటకో మాట, రోజుకో కండువా కప్పుకొని చపచిత్త మనతస్తత్వంతో కాం వెళ్లదీస్తున్నాం. ‘కుం పునాదు మీద జాతినిగానీ, నీతినిగానీ నిర్మించలేం’ అని మీరంటే వాటిమీదే అధికార బురుజు నిర్మిస్తున్న వారితోనే చేతు కలిపి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాం. మాది కాని సిద్ధాంతాలను నమ్ముతూ నట్టెటా మునుగుతూ బానిసత్వాన్ని ఆస్వాదిస్తున్నాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి అగ్రకులా పంచనజేరి...వారు విదిల్చే తాయిలా కోసం కాచుక్కూర్చుంటున్నాం. మాలో ఉన్న చిన్నచిన్న పొరపాట్లను పక్కనబెట్టి ఒక్కటైపోవాల్సిందిపోయి అగ్రకులా చేతుల్లో ఆటబొమ్ముగా మారిపోయాం. పైకి మాత్రం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మతమైనార్టీ ఐక్యత వర్ధిల్లానే భూటకపు నినాదాను భీకరంగా చేస్తున్నాం. అయిన ఈ ఐక్యత నినాదాలను పట్టింకున్నదెవరూ?...వాటికి బెదిరెదెవరూ? ఎవరిపనిలో వాళ్లున్నారు. ఎవరి రాజకీయాలు వారికున్నాయి. మాకు మాత్రం ఏ జెండా, ఎజెండా లేక వ్యక్తి పూజతో పరాయికరణలో మైమరిచిపోతున్నాం.


  మాలో ఈ అనైక్యతను పసిగట్టిన అగ్రకుల రాజకీయపార్టీలు, పాలకులు మమ్మల్ని వేర్వేరుగానే చూస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తరగతుల, మత మైనార్టీల, ఆధిపత్యకులాలుగా చీలిన సమాజాన్ని అట్లాగే కొనసాగిస్తూ..ఎవరి వాటా వారికిస్తున్నాం అంటూ అడిగినవారికల్లా చెప్పుకుంటూ పోతూ వారి‘పని’వారు కానిచ్చేస్తున్నారు. అవసరానికి ఏం చెప్పినా నమ్ముతున్నాం. నిజమే అని  హామీలిచ్చిన వారినే అమాయకంగానమ్మి అందలమెక్కిస్తున్నాం. ఆనకమోసపోతున్నాం. ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న...ఓడ దిగాక బోడిమల్లన్న..అన్నట్లు అంతా తూచ్‌ అన్నా కూడా వారినే శభాష్‌ అంటున్నాం..వారికే జేజేలు పలుకుతున్నాం. అవకాశవాద రాజకీయాలు దేశమంతా నడుస్తున్నా మాకింకా సోయిరావడం లేదు. ఐక్యతా, ఆత్మగౌరవం అంగట్లో తాకట్టు పెట్టినందుకే కావచ్చు మాకీ దుస్థితి. శూద్రులంతా ఒక్కటిగా ఉండకపోతే బ్రాహ్కణాధిపత్యం మన సమాజాన్ని చీల్చుతుందని సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఏనాడో హెచ్చరించారు. అయినా ఐక్యతా నినాదాలు తప్ప ఒక్కో సామాజిక నేపథ్యమున్న అణగారిన జాతి మరో సాటి సామాజిక నేపథ్యమున్న జాతితో కలిసే పరిస్థితి లేదు.

  స్వతంత్ర భారతంలో ఇంకా కులమే రాజ్యమేలుతోంది. కులమే అన్నింటా తిష్టవేసుకొని కూర్చుంది. ‘నిచ్చెనమెట్ల హిందూ వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం పెంపొందిస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తద్వారా కులనిర్మూన జరుగుతుందని’ మీరెప్పుడో  చెప్పారు. అందుకే సహాపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలను ప్రోత్సహించాన్నారు. కానీ ఇప్పుడు కులాంతర వివాహాలు పరువు హత్యలుగా రూపాంతరం చెందాయి. సహపంక్తి భోజనాలు ఫక్తు రాజకీయాయ్యాయి. అవసరం కోసం సంపన్న కులాలవాళ్లు దళితు ఇళ్లల్లోకి వచ్చి బాగానే సహంపక్తి భోజనాలు చేస్తున్నారు.. భోజనాలు అయ్యాక వారిని తమతో సమానంగా పరిగణించేందుకు మాత్రం(చూసేందుకు) ససేమిరా అంటున్నారు. సరికదా వారి ఇళ్లల్లోకి దళితును ఇప్పటికీ అడుగు కూడా పెట్టనీయడం లేదు. అదేమంటే ‘అంటు’ అంటున్నారు. అక్కడక్కడా ఇంకా రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతూనే ఉంది. దేవాయాల ప్రవేశం ఇంకా నిషిద్ధమే. ‘అట్రాసిటీ’చట్టాలు తెచ్చుకున్నా సమాజంలో ఏలాంటి మార్పు రావడం లేదు. అయినా మేం మారడం లేదు. ఒక్కటిగా ఉండటం లేదు!!

  specail article on baba saheb ambedkar on his 62nd death anniversary
  (Image: Getty Images)


  హిందూ వేదాల, శాస్త్రాల్లోని కల్పిత కట్టుకథలు, అసమాన విలువలను ధ్వంసం చేసిననాడే సమాజం సమానప్రతిపాదికన రూపుదిద్దుకుంటుందని మీరు ఏనాడో చెప్పారు. ఇంతటి అసమానమైన, నైతిక విలువలేని, హిందూవ్యవస్థలో జన్మించినందుకు బాధపడ్డారు. ‘పుట్టడం నా చేతుల్లో లేదు..కానీ హిందువుగా మాత్రం చనిపోనని’ మానవీయ విలువలున్న బౌద్ధాన్ని స్వీకరించారు. కానీ..నేడు అదే మీ జాతిలో పుట్టినవారు, మీ వారసులుగా చెప్పుకుంటున్నవారు వివక్షమయమైన హిందూవ్యవస్థలోనే కొనసాగడాన్ని గర్వంగా ఫీవుతున్నారు.అంటరానిజాతు మేల్కొలుపు, అణగారినవర్గాల అభివృద్ధికోసం చివరి రక్తపు బొట్టు వరకూ మీ శక్తికి మించి పోరాడారు. మాకోసం ప్రపంచాన్నే ఔపోసనపట్టారు.విలువవైన రాజ్యాంగాన్నే ఆయుధంగా అందించారు.. మీ జీవిత పోరాటాన్నే జ్ఞానఖడ్గంగా ప్రసాదించారు. ‘మీ రాజాన్ని మీరే ఏలండి’ అంటూ ఓటు అనే పదునైన అధికార ఆయుధాన్నిచ్చారు. అయినా మేం ‘పరాయికరణ’ను, బానిసత్వపు నిద్ర నుంచి తేరుకోవడం లేదు. మీరు సాధించిన ఫల రథాన్ని చేతనైతేనే ముందుకు తీసుకెళ్లండి... లేకపోతే అక్కడే వదిలేయండికానీ వెనక్కిమాత్రం తీసుకెళ్లొద్దని ఆర్తించారు. అయినా మాకు సోయి రావడం లేదు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే బతుకులీడుస్తున్నాం.


  ఏ జెండా పు(ప)డితే ఆ జెండాపట్టుకు వేలాడుతున్న మాతో...‘మీకంటూ ఒకజెండా అజెండా  ఉందన్న’ సంగతి చెప్పేదెవరు సాహెబ్‌ ?! ఇప్పటికీ మిమ్మల్ని అన్యాయంగా పక్కనబెట్టినా, మీ పేరే చెప్పుకుంటూ కూర్చున్నకొమ్మనే నరుక్కుంటున్న అజ్ఞానపు అవివేకంతో దారితప్పిన గొర్రెప్లిల్లలా తలోదిక్కున వెళ్తున మమ్మల్ని మన్నించుమని అడిగే అర్హత కూడా లేదేమో! రోజురోజుకి రూపం మార్చుకుంటూ ఆధునిక భారతాన్ని బలితీసుకుంటున్న కులకోరల్ని నలిపేయ్యడానికి, దారితెన్నుల్లేకుండా ఆగమైపోతున్న నీ జాతిని ఫెడదోవనుంచి విడిపించి.. మీమార్గంలో నడిపించడానికి...మళ్లీ ఎప్పుడు పుడ్తావ్‌ తండ్రీ?!

  భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

  (మహేష్‌ కొంగర, సీనియర్ జర్నలిస్ట్)
  Published by:Santhosh Kumar S
  First published: