Home /News /national /

AMAZON DRUG CASE WHY NOT ARRESTS LIKE ARYAN KHAN DRUG CASE ACTION SHOULD BE TAKEN ON AMAZON INCIDENT CAIT EVK

Amazon Drug Case: "ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్‌ కేసు"లా ఎందుకు అరెస్టులు చేయరు?.. అమెజాన్ ఘ‌ట‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి : సీఏఐటీ

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (image: Amazon India)

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (image: Amazon India)

Amazon Drug Case: ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్ పోలీసులు 720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలో అమెజాన్ అధికారులను అరెస్టు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (Confederation of All India Traders) డిమాండ్ చేసింది.

  ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు 720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలో అమెజాన్ అధికారులను అరెస్టు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (Confederation of All India Traders) డిమాండ్ చేసింది. అమెజాన్ (Amazon) ఘ‌ట‌న‌పై సీఏఐటీ న‌వంబ‌ర్ 28, 2021న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఎన్‌డీపీఎస్ చ‌ట్టం కింద న‌మోదైన మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ రవాణా కేసులో అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీఏఐటీ (CAIT) ఆరోపించింది. బాలీవుడ్ న‌టుడు షారుఖ్‌ఖాన్ కొడుకు ఆర్య‌న్‌ఖాన్  కేసు (Aryan Khan drug case) లోలాగా వేగంగా అరెస్టు ఎందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించింది. ఆ కేసులోలాగా మ‌ధ్యప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వేగంగా చ‌ర్య‌లు ప్రారంభించాల‌ని కోరింది. ఈ స‌మ‌స్య‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను సంఘం కోరింది.

  అస‌లేం జ‌రిగింది..
  నవంబర్ 14న, 2021 మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని భింద్ జిల్లాలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. వారిపై ఎన్‌డీపీఎస్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఈ గంజాయి ర‌వాణా ఈ-కామ‌ర్స్ పోర్ట్ ద్వారా స‌ర‌ఫ‌రా అయింద‌ని పోలీసులు గుర్తించారు. భింద్ పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఈ కేసు ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 38 కింద నమోదు చేయబడింది. భింద్ ఎస్పీ మనోజ్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  Instant Loan Apps: యాప్‌ల‌లో లోన్ తీసుకొంటున్నారా..? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోవాల్సిందే


  ఈ పోర్టల్ ద్వారా 20 సరుకులు బుక్ అయ్యాయని, అందులో గంజాయిని డెలివరీ చేయడానికి ఆన్‌లైన్‌లో చేసిన బుకింగ్‌ల గురించిన సమాచారాన్ని ఇంకా సేకరించలేదని ఆయన చెప్పారు. ఈ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన భింద్ పోలీసులు అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ స‌మ‌స్య‌పై అమోజాన్ ఇంకా బ‌హిరంగంగా వ్యాఖ్యానించ‌లేదు.

  ఈ కేసులో లీడ్‌లను అనుసరించి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు విశాఖపట్నంలో 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మరియు అమెజాన్ ద్వారా దేశవ్యాప్తంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

  ఈ సంద‌ర్బంగా దీనిపై సీఏఐటీ స్పందించింది. ఈ కేసులో పోలీసులు వివ‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంది. ఇప్ప‌టిదాకా ఎవ‌రినీ పోలీసులు ఎందుకు అరెస్టు చేయ‌లేదని ప్ర‌శ్నించింది.
  ఈ ఘ‌ట‌న‌పై సిఎఐటి జాతీయ అధ్యక్షులు బి.సి.భారతియా మాట్లాడారు. కేవ‌లం వాట్స‌ప్ చాట్ ఆధారంగా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేయడంలో NCB "సమయం వృధా చేయలేదని" అతను చెప్పాడు, అమెజాన్‌పై కేసులో, కంపెనీ అధికారులను పేర్కొన్నప్పటికీ పోలీసులు ఎటువంటి అరెస్టులు చేయలేదని ఆయన అన్నారు.

  నిషేధిత ప‌దార్థాన్ని ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా చేస్తుంటే కొనుగోలు చేసిన వారిని, గిడ్డంగుల‌ను, ర‌వాణా దారుల‌ను, దిగుమ‌తి చేసిన‌, ఎగువ‌మ‌తి చేసిన వారిని ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్టు చేసే అవ‌కాశం ఎన్‌డీపీఎస్ చ‌ట్ట ప్ర‌కారం ఉంద‌ని సీఏఐటీ (CAIT) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.

  Telangana MLC Elections: తెలంగాణ‌లో రాజ‌కీయ వేడీ.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతోంది!


  అయినా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ పోలీసులు మాత్రం అమెజాన్ అధికారులను అరెస్టు చేయడానికి బదులుగా నోటీలు ఇచ్చి వారి ప్ర‌త్యుత్త‌రం కోసం చూస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. దేశంలో భార‌త రాజ్యాంగం అంద‌రికీ స‌మాన హ‌క్కు ఇస్తోంద‌ని కానీ పోలీసుల తీరు ఒకే ర‌క‌మైన కేసులో విభ‌న్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు.

  అమెజాన్ ప్ర‌మేయం ఉంది : సీఏఐటీ
  స్టెవియా డ్రై లీవ్‌ల ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న ఆరు కంపెనీలు అమ్మకందారులుగా నమోదు చేసుకున్నట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులకు దాఖలు చేసిన సమాధానంలో అమెజాన్ పేర్కొన్నట్లు సీఏఐటీ(CAIT) ప్రకటనలో పేర్కొంది. ఇక‌మీదైనా ఈ-కామర్స్ పోర్టల్ విక్రేతల KYCని తప్పనిసరి చేయాల‌ని వారు డిమాండ్ చేశారు.
  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ యొక్క ఇటీవలి ఢిల్లీ హైకోర్టు కార‌ణంగా అమెజాన్‌కు స‌మ‌న్ల జారీ చేయ‌డంపై చర్యను భార్టియా మరియు బి.సి.భారతియా, ఖండేల్‌వాల్ ప్రశంసించారు. అంతే కాకుండా అమెజాన్ ద్వారా "పిఎమ్‌ఎల్‌ఎ" (మనీలాండరింగ్ నిరోధక చట్టం) ఉల్లంఘనను పరిశీలించాలని ఏజెన్సీని ద్వారా కోరారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Amazon, AMAZON INDIA, Amit Shah, Bollywood drugs case, Drug case

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు