హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !

Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !

 అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !

అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !

ఒక కుటుంబం గుండె జబ్బు (Heart Disease) తో బాధపడుతున్న తమ 67 ఏళ్ల కుటుంబ సభ్యురాలి ఆపరేషన్ కోసం ఏకంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించారు. వీరు ఆమెను ఒక ఇండియన్ ఎయిర్ అంబులెన్స్‌ (Air Ambulance)లో యూఎస్ నుంచి భారతదేశానికి తరలించారు.

ఇంకా చదవండి ...

తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పరిస్థితి విషమంగా మారినప్పుడు మెరుగైన వైద్యం (Treatment) కోసం మంచి ఆసుపత్రికి తీసుకెళ్లడం సాధారణమైన విషయం. మంచి ఆసుపత్రి ఎక్కడున్నా సరే అక్కడికి రోగులను తరలించేందుకు వారి కుటుంబసభ్యులు సిద్ధమవుతారు. తాజాగా ఒక కుటుంబం గుండె జబ్బు (Heart Disease) తో బాధపడుతున్న తమ 67 ఏళ్ల కుటుంబ సభ్యురాలి ఆపరేషన్ కోసం ఏకంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించారు. వీరు ఆమెను ఒక ఇండియన్ ఎయిర్ అంబులెన్స్‌ (Air Ambulance)లో యూఎస్ నుంచి భారతదేశానికి తరలించారు. ఈ విమానయానం 26 గంటల పాటు కొనసాగగా.. ఇందుకు అక్షరాలా 133,000 డాలర్లు (రూ.1 కోటి కంటే ఎక్కువే) ఖర్చు కావడం విశేషం. ఈ వేలాది కిలోమీటర్ల తరలింపును ఇటీవలి కాలంలో భారతదేశానికి అత్యంత సుదీర్ఘమైన ఏరోమెడికల్ లిఫ్టింగ్‌గా అభివర్ణిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు (Bengaluru)లోని ఇందిరానగర్‌కు చెందిన 67 ఏళ్ల మహిళ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధ పడుతున్నారు. ఈ తీవ్రమైన జబ్బుకు మెరుగైన చికిత్స కోసం ఆమె అమెరికాకి వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే తన పిల్లలతో కలిసి ఒరెగాన్‌లో ఉంటున్నారు. యూఎస్‌లో వైద్యం తీసుకున్నా ఆమె ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆమెకు యూఎస్‌లో ఎక్కువ ఖర్చు అవుతున్నా తగిన వైద్యం లభించడం లేదని భావించారు. ఇటీవల ఈ మహిళ అనారోగ్యం మరింత క్షీణించింది. దాంతో కుటుంబ సభ్యులు చెన్నైకి విమానంలో తరలించి అక్కడ హార్ట్ ఆపరేషన్ చేయించేందుకు సిద్ధమయ్యారు. ఆమెను లెగసీ గుడ్ సమారిటన్ మెడికల్ సెంటర్ నుంచి పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంబులెన్స్‌లో తరలించారు. ఆదివారం ఉదయం ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్ నుంచి ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభమైంది.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


ఆమెను భారత వైద్య రవాణా సేవ సంస్థ ICATT కి చెందిన ప్రైవేట్ జెట్ ఛాలెంజర్ 605లో చేర్చారు. ఈ జెట్‌ను ఫ్లయింగ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)గా మార్చారు. అలా ఆదివారం ఉదయం మొదలైన ప్రయాణం మంగళవారం తెల్లవారుజామున 2:10 గంటలకు పూర్తయింది. అంటే యూఎస్‌లోని పోర్ట్‌ల్యాండ్ నుంచి చెన్నైకి చేరుకోవడానికి 26 గంటల సమయం పట్టింది. విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మహిళను అంబులెన్స్‌లో అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఎయిర్‌లిఫ్ట్ ఖర్చు 133,000 డాలర్లు (రూ. 1 కోటి కంటే కొంచెం ఎక్కువ) కావడం గమనార్హం. ఆమెను రెండు సూపర్-మిడ్‌సైజ్ ప్రైవేట్ జెట్‌ల్లో ఇండియాకి తరలించారు. ఇప్పుడు ఆమెను హార్ట్ ఆపరేషన్‌కు సిద్ధం చేస్తున్నారు.

విమానంలో రోగిని పర్యవేక్షించడానికి ముగ్గురు వైద్యులు, ఇద్దరు పారామెడికల్‌లతో సహా వైద్య బృందంతో ఒక ICU ఏర్పాటు చేశారు. ఆమెను 7.5 గంటల్లో రేక్‌జావిక్ విమానాశ్రయానికి తరలించారు. విమానానికి ఇంధనం నింపడం కోసం ఐస్‌ల్యాండ్ రాజధాని వద్ద ఆగిపోయింది. తరువాత రోగిని టర్కిష్ విమానాశ్రయంలోని మరొక ఛాలెంజర్ 605కి మార్చారు. చివరికి అది చెన్నైలో ల్యాండ్ అయింది. యూఎస్‌లో చికిత్స వ్యవధి ఎక్కువ, ఆమెను భారతదేశానికి విమానంలో తరలించడం కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని ఎయిర్ అంబులెన్స్ సేవల సంస్థ ICATT సహ వ్యవస్థాపకుడు.. డైరెక్టర్ డాక్టర్ షాలిని నల్వాడ్ అన్నారు.

Published by:Mahesh
First published:

Tags: Chennai, Free ambulance, Heart Attack, USA

ఉత్తమ కథలు