ముసలోడే కానీ మహానుభావుడు... వయసు 72ఏళ్లు.. బ్రెయిన్‌లో మాత్రం ఏ మాత్రం పదును తగ్గలేదు. మీరు కూడా ఆర్థిక పరిస్థితితో ఇబ్బంది పడుతుంటే, కొన్ని నెలల్లో మీ సమస్యలను చక్కదిద్దే ప్లాన్ ఒకటి వినండి. తన తలరాతనే మార్చుకున్న ఓ వృద్ధుడి కథ ఇది. బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లా మజౌలియా బ్లాక్‌లోని భార్వాలియా గ్రామానికి చెందిన ఓ రైతు కేవలం 3 నెలల్లో కేవలం ర.6వేల ఖర్చుతో రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు సంపాదించాడు. గ్రామ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచాడు..! ఇదేంటి ఆరు వేల ఖర్చుతో 2లక్షల రూపాయలు ఎలా సంపాదించాడు.. ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నారా..? అది కూడా 72ఏళ్ల వృద్ధుడికి ఇది ఎలా సాధ్యమైందని థింగ్ చేస్తున్నారా..?
ప్రభుత్వ పథకం ద్వారా:
భర్వాలియా గ్రామానికి చెందిన రామచంద్ర అనే 72 ఏళ్ల రైతు బీహార్ ప్రభుత్వ ఉద్యాన మిషన్ పథకం గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ పథకాన్ని సద్వినియోగం చేసువాలని డిసైడ్ అయ్యాడు. సుమారు 200 బస్తాల పుట్టగొడుగులను బస్తాకు రూ.8 చొప్పున కొనుగోలు చేశాడు. ఒక్కో బ్యాగులో 4 నుంచి 6 కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి అయ్యాయి. మూడు నెలల్లో పుట్టగొడుగుల కొనుగోలుకు మొత్తం రూ.6 వేలు ఖర్చు చేశాడు. దీంతో కేవలం 90 రోజుల్లోనే రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు సంపాదించాడు. ప్రస్తుతం 400 బస్తాల పుట్టగొడుగుల పంట ఉంది. తొలిసారి పుట్టగొడుగుల ఉత్పత్తిని ప్రారంభించినట్లు రామచంద్ర తెలిపారు. అంటే కేవలం ప్రభుత్వ పథకం ద్వారానే.. సబ్సిడికి కొని రామచంద్ర ఇంత ఆదాయం సంపాదించాడు.
మంచి పథకమని ప్రసంశలు:
హార్టికల్చర్ మిషన్‌ను ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు. హార్టికల్చర్ మిషన్ కింద పుట్టగొడుగుల ఉత్పత్తిపై ప్రభుత్వం నుంచి 90 శాతం సబ్సిడీ పొందచ్చు. హార్టికల్చర్ bihar.gov.inకు వెళ్లి, అక్కడి నుండి తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం ఆధార్ కార్డు, ఫొటో, పుట్టగొడుగు శిక్షణ సర్టిఫికెట్, లేఅవుట్ ప్లాన్, ఎస్టిమేట్ ఉండాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న కొద్దీ రోజుల్లోనే అధికారులు మీ అప్లికేషన్‌ను పరిశీలిస్తారు. తర్వాత వ్యవసాయ కేంద్రం నుంచి గరిష్టంగా 200 పుట్టగొడుగుల పంట బస్తాలను 90 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉంచుతారు. మంచి ఉత్పత్తిని కలిగి ఉండటానికి, ఓస్టెర్ పుట్టగొడుగు జాతులు మాత్రమే అందిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.