హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. అకస్మిక వరదలు.. ఐదుగురు మృతి

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. అకస్మిక వరదలు.. ఐదుగురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amarnath Yatra: ఆకస్మిక వరదల కారణంగా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన పలువురు గల్లంతయ్యారు.

  కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అమర్‌నాథ్ గుహ సమీపంలో ఆకస్మికంగా వరదలు రావడంతో 9 మంది గల్లంతయ్యారు. వీరిలో ఐదురుగు చనిపోయినట్టు జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) పోలీసులు తెలిపారు. దీంతో యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆకస్మికంగా భారీ వర్షం పడటం.. బలమైన నీటి ప్రవాహం రావడంతో మూడు యాంకర్లతో సహా అనేక టెంట్లు కొట్టుకుపోయాయి. సంఘటన తర్వాత అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) వాయిదా వేశారు. వెంటనే NDRF, SDRF బృందాలను సహాయక చర్యల కోసం మోహరించారు.

  ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసు ఐజిపి తెలిపారు. అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో నీరు వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ద్వారా యాత్రికులను సురక్షితంగా తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

  కరోనా విజృంభణ తరువాత రెండేళ్ల పాటు అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం నిలిపేసింది. ఈ ఏడాది మళ్లీ యాత్రకు భక్తులను అనుమతించింది. ఎత్తైన ప్రదేశం కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్న ప్రయాణీకులకు తగిన ఏర్పాట్లు చేసింది. ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లు, 6,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో మెడికల్ బెడ్‌లు, అంబులెన్స్‌లు మరియు హెలికాప్టర్‌లను మోహరించాలని అధికారులను ఆదేశించింది.

  Petrol: దేశంలో 5 ఏళ్ల తరువాత పెట్రోల్ నిషేధం.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

  Shocking: బ్లేడ్ తో కోసుకుని.. పీవీఆర్ సినిమా హల్ లో వ్యక్తి సూసైడ్..

  శివునికి అంకితం చేయబడిన గుహ దేవాలయానికి 3,888 మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ యాత్ర జరుగుతుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వార్షిక అమర్‌నాథ్ యాత్ర 2020, 2021లో జరగలేదు. 2019 సంవత్సరంలో ఆర్టికల్ 370లోని చాలా నిబంధనలను రద్దు చేయడానికి ముందు దాని వ్యవధి తగ్గించబడింది. ఇది ప్రభుత్వానికి కూడా పెద్ద సవాల్‌. ఈసారి 12,000 మంది జవాన్లతో పాటు వేలాది మంది జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బందిని కూడా యాత్ర మార్గంలో మోహరించాలని భావిస్తున్నారు. తీర్థయాత్రకు ఒక మార్గం పహల్గామ్ నుండి మరొకటి బాల్తాల్ మీదుగా ఉంటుంది. డ్రోన్ కెమెరాలు ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడంలో భద్రతా దళాలకు సహాయపడతాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Amarnath Yatra 2022

  ఉత్తమ కథలు