AMARINDER SINGH LIKELY TO BE NDA VICE PRESIDENTIAL CANDIDATE PVN
Vice President Election : ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్ సింగ్!
అమరీందర్ సింగ్(ఫైల్ ఫొటో)
Amarinder Singh : ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో వచ్చే నెలలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడే షెడ్యూల్ ను విడుదల చేసింది.
Amarinder Singh : ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో వచ్చే నెలలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు(Vice President Election) జరుగనున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడే షెడ్యూల్ ను విడుదల చేసింది. జూలై 5న ఉప రాష్ట్రపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.జూలై 19 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ. జూలై 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. జూలై 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఆగష్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ నిర్వహించిన రోజునే ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు.
అయితే ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి(NDA Vice President Candidate)గా పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్(Amarinder Singh) ఉండనున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని మాజీ సీఎం కార్యాలయం శనివారం తెలిపింది. అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన కార్యాలయం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అమరీందర్ సింగ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. వెన్నుముఖ శస్త్రచికిత్స కోసం ఆయన అక్కడకు వెళ్లారు. గత ఆదివారం అమరీందర్‌కు సర్జరీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో ఆయనతో మాట్లాడారు. అమరీందర్ సింగ్ వచ్చే వారం లండన్ నుంచి పంజాబ్ కు తిరిగి రానున్నారు. అనంతరం ఆయన బీజేపీలో చేరడంతోపాటు తన పార్టీ పీఎల్‌సీపీని బీజేపీలో విలీనం చేయనున్నారని సమాచారం. విలీనం అనంతరం కెప్టెన్‌ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కాగా,దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉండి మూడు సార్లు సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్ ను గత ఏడాది పంజాబ్ సీఎం పదవి నుంచి కాంగ్రెస్ మార్చింది. సీఎం పదవి నుండి వైదొలిగిన తర్వాత ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో అభిప్రాయ భేదాలు తల్లెత్తాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్ ఘోరంగా ఓడిపోయారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.