Home /News /national /

AMAR JAWAN JYOTI TO BE OUT AFTER 50 YEARS TO BE MERGED WITH WAR MEMORIAL TORCH TODAY OPPN SLAMS MODI GOVT MKS

50ఏళ్లుగా వెలుగుతోన్న Amar Jawan Jyoti శాశ్వతంగా ఆర్పివేత.. War Memorialలో విలీనం.. ఘోర అవమానమంటూ..

అమర్ జవాన్ జ్యోతి (పాత ఫొటో)

అమర్ జవాన్ జ్యోతి (పాత ఫొటో)

దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల నేటి నుంచి శాశ్వతంగా ఆరిపోనుంది. అమర్ జవాన్ జ్యోతి స్థలిని పూర్తిగా ఎత్తేయనున్నారు.

సైనిక శక్తి పరంగా చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద శక్తిగా ఉన్న భారత్‌లో అమరవీరులకు సంబంధిచి అనూహ్య మార్పు ఇవాళ చోటుచేసుకోనుంది. సైనిక వర్గాలు, ప్రభుత్వ పెద్దలతోపాటు విదేశీ అతిథులు సైతం సందర్శించుకునే గొప్ప స్మారం ఒకటి పూర్తిగా కనుమరుగుకానుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల నేటి నుంచి శాశ్వతంగా ఆరిపోనుంది. అమర్ జవాన్ జ్యోతి స్థలిని పూర్తిగా ఎత్తేయనున్నారు. ఆ జ్యోతిని ఢిల్లీలోనే ఉన్న వార్ మెమోరియల్ వద్ద గల టార్చిలో విలీనం చేస్తారు. కాగా, ఇది అమర జవాన్లకు జరుగుతోన్న ఘోర అవమానమంటూ మోదీ సర్కారుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.

ఇండియాగేట్, వార్ మెమోరియల్ ల వద్ద రెండు జ్వాలల నిర్వహణ కష్టతరమవుతోందని గుర్తించిన నేపథ్యంలో అమర్ జవాన్ జ్యోతిని శాశ్వతంగా వార్ మెమోరియల్ లోకి విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల స్మరణార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర జ్యోతిని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిరంతరం మండుతున్న అమర్ జవాన్ జ్యోతి 50 ఏళ్ల తర్వాత ఆరిపోనుంది. గణతంత్ర దినోత్సవాలకు ముందే జ్యోతి విలీనం జరుగుతుండటం గమనార్హం.

T20 World Cup 2022 మ్యాచ్‌ల తేదీలు, వేదికలివే: భారత్ తొలి పోరు పాక్‌తో -full scheduleఅమర్ జవన్ జ్యోతి వద్ద నుంచి జ్వాలను సైనిక లాంఛనాలతో తీసేసి, వార్ మెమోరియల్ కు విలీనం చేసే కార్యక్రమం ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్(వైస్ సీడీఎస్) ఎయిర్ మార్షల్ బలబద్ర రాధా కృష్ణ, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరవుతారు. ఇప్పటికే దేశంలోని అమరవీరుల కోసం జాతీయ యుద్ధ స్మారకం నిర్మించినందున, ఇండియా గేట్ వద్ద ప్రత్యేక జ్యోతి ఎందుకు వెలిగించాలనే వాదన కూడా ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

UP Elections 2022: 'బికినీ గర్ల్‌'పై బీజేపీ గరంగరం.. కలిపి చూడొద్దన్న Archana Gautam


నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఇండియా గేట్‌పై చెక్కిన అమరవీరుల పేర్లు కూడా ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నేషనల్ వార్ మెమోరియల్‌లో 1947-48 పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం నాటి నుంచి గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ వరకు వివిధ ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ రక్షణ సిబ్బంది అందరి పేర్లు కూడా ఉన్నాయి.

బావ అఖిలేశ్‌పై మరదలు పోటీ! -ఆమెది యోగి కులమే!! -ఎవరీ Aparna Yadav?


వార్ మెమోరియల్ స్మారకం గోడలపై ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లు కూడా ఉన్నాయి. నేషనల్ వార్ మెమోరియల్‌లోని అమర జవాన్ జ్యోతిలో దీన్ని కలపనున్నారు.ఈ స్మారక చిహ్నంలో భారత సైన్యం, వైమానిక దళం , నావికాదళం చేసిన ప్రసిద్ధ యుద్ధాలను వర్ణించే ఆరు కాంస్య కుడ్యచిత్రాలు, వీర్త చక్రం గ్యాలరీలో ఉన్నాయి. పాకిస్థాన్‌తో 1971 యుద్ధం అనంతరం నాటి అమరుల స్మరణార్థం 1972లో అమర్ జవాన్ జ్యోతి వెలిగించారు. ఇదిలా ఉంటే,

India Covid Update : మరణ మృదంగం -ఒక్కరోజే 703 మంది మృతి -కొత్తగా 3.47లక్షలు.. యాక్టివ్ కేసులు 20 లక్షలపైనే


అమర్ జవాన్ జ్యోతిది విలీనం మాత్రమేనని ఆర్మీ వర్గాలు చెబుతున్నా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అమర్ జవాన్ జ్యోతిని తిరిగి వెలిగిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. ‘మన వీర జవాన్ల కోసం వెలిగిన అమర జ్వాల నేడు ఆరిపోవడం చాలా బాధాకరం. కొంతమందికి దేశభక్తి, త్యాగం అనేవి అర్థం కావు. పర్వాలేదు, మన సైనికులకు మరోసారి అమర్ జవాన్ జ్యోతి వెలిగిస్తాం’అంటూ మోదీ సర్కారుపై రాహుల్ ఫైరయ్యారు. మరో కాంగ్రెస్ నేత మనీశ్ తివారి స్పందిస్తూ, కొత్త పార్లమెంట్ భవంతి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కోసం వార్ మెమోరియల్ ను ధ్వంసం చేస్తున్నారని, భారత ప్రజల స్పృహలో నిండిపోయిన అమర్ జవాన్ జ్యోతిని ఆర్పేయడం నేరం కంటే తక్కువ కాదని ఆరోపించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Delhi, Indian Army

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు