Journalist Mohammad Zubair : ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ "ఆల్డ్ న్యూస్" సహ వ్యవస్థాకుడు జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్ అరెస్ట్
ఆల్డ్ న్యూస్ సహ వ్యవస్థాకుడు జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్
AltNews co founder Arrested:ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ "ఆల్ట్ న్యూస్(AltNews)"సహ వ్యవస్థాపకుడు జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌ను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
AltNews co founder Arrested:ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ "ఆల్ట్ న్యూస్(AltNews)"సహ వ్యవస్థాపకుడు జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌ను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీశారని, శత్రుత్వాన్ని ప్రేరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఐపిసి సెక్షన్లు 153, 295 కింద మహ్మద్ జుబైర్‌ను అరెస్టు చేశారు. జుబైర్ u/s 153A/295A IPC నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తునకు పిలిచామని... "తగిన సాక్ష్యాలు ఉన్నందున అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జుబైర్ అరెస్ట్‌ను ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ధ్రువీకరించారు. 2020 నాటి కేసుకు సంబంధించి జుబైర్‌ను దిల్లీ పోలీసులు ప్రశ్నించడానికి పిలిచారని, అయితే ఈ కేసు విషయంలో ఎలాంటి అరెస్టు చేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆల్ట్‌న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ట్వీట్ చేశారు. అయితే, జుబైర్ వేరే ఎఫ్ఐఆర్లలో అరెస్టు చేశారని.. ఆయా సెక్షన్ల పరిధిలో ఆయనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని... పదేపదే అభ్యర్థించినప్పటికీ మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదు అని సిన్హా ట్వీట్ చేశారు.
బీజేపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫేక్ వార్తలను ప్రతిరోజూ బయటపెడుతున్న ప్రపంచంలోనే అత్యుత్తమ జర్నలిస్టులలో ఒకరైన మహమ్మద్ జుబైర్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. మహమ్మద్ జుబైర్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అధికారులను ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప ఇలాంటి వాళ్లపై కాదని డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు.
మరోవైపు, : బీహార్‌లోని వైశాలి జిల్లాలో జరుగుతున్న ఓ వ్యవహారం తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లను అరికట్టేందుకు పోలీసు బృందం హజీపూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న హోటళ్లపై రైడ్(Raid) చేసేందుకు వెళ్లింది. బీహార్(Bihar)లో అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు చేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ నిఘా వర్గాల సమాచారంతో హాజీపూర్(Hajipur) రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న డజనుకు పైగా హోటళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. అయితే పోలీసులు హోటళ్లపై దాడులు చేయడం ప్రారంభించినప్పుడు...అక్కడ జరుగుతున్న యవ్వారం తెలిసి పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక్కడి హోటళ్లలో సాగుతున్న భారీ వ్యభిచార రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. డబ్బు కోసం హోటళ్లలో పెద్దఎత్తున వ్యభిచార వ్యాపారం సాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాదాపు 15మంది మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల ఈ దాడితో అసాంఘిక శక్తులతో పాటు అనైతిక పనులు చేసే వారిపై కూడా వేటు పడింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.