ALMOST HALF OF STUDENTS IN INDIA WALK TO SCHOOL NAS REPORT PVN
Walk To School : దేశంలో 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే స్కూల్ కి!
(ప్రతీకాత్మక చిత్రం)
NAS Report : కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే-2021 రిపోర్ట్ ప్రకారం...దేశంలోని 48 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు కాలినడకన వెళ్తున్నారు. స్కూల్ బస్సుల్లో 9 శాతం, ప్రజారవాణా వాహనాల్లో 9 శాతం బడికి వెళ్తున్నారు.
half of students in India walk to school : దేశంలో దాదాపు సగం మంది విద్యార్థులు కాలినడకన పాఠశాలలకు వెళ్తున్నారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే-2021 రిపోర్ట్ ప్రకారం...దేశంలోని 48 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు కాలినడకన వెళ్తున్నారు. స్కూల్ బస్సుల్లో 9 శాతం, ప్రజారవాణా వాహనాల్లో 9 శాతం బడికి వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా 18 శాతం మంది విద్యార్థులు సైకిళ్లపై పాఠశాలలకు వెళ్తున్నారని పేర్కొంది. 8 శాతం మంది విద్యార్థులు మాత్రం తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తుంటే, 3 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు ఫోర్ వీలర్లలో వస్తున్నట్లు సర్వేలో తేలింది.ఈ సర్వేను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి 720 జిల్లాల్లోని 1.18 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 34 లక్షల మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు.
మరోవైపు ఈ సర్వేలో భాగంగా 3, 5, 8, 10 తరగతి విద్యార్థులు అభ్యసన సామార్థ్యాలపైన నిర్వహించారు. విద్యార్థుల అభ్యసన సామార్థ్యాలు జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలోని రెండు మూడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామార్థ్యాలు తక్కువగా ఉన్నాయని తేలింది.
కోవిడ్ ప్రభావం విద్యా వ్యవస్థపై పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో విద్యార్థుల అభ్యసన సామార్థ్యాలు ఎలా ఉన్నాయనే దానిపై ఎన్ఏఎస్ సర్వే చేసింది. అయితే కోవిడ్ సమయంలో పాఠశాలలు మూసివేసిన తర్వాత 78 శాతం మంది ఆన్లైన్ తరగతులు, ఇంటి దగ్గర నేర్చుకోవడానికి ఆసక్తి చూపించలేదు. 80 శాతం మంది విద్యార్థులు పాఠశాలలోనైతెనే బాగా నేర్చుకుంటున్నారని నివేదికలో తెలిపింది. 24శాతం మంది విద్యార్థులకు సాంకేతిక పరికరాలు లేవు. 38 శాతం మంది కోవిడ్ సమయంలో నేర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎన్ఏఎస్ వెల్లడించింది. ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి.
65 శాతం మంది ఉపాధ్యాయులపై ఎక్కువ పనిభారం పడుతున్నట్టు నివేదిక వెల్లడించింది. తాము చేస్తున్న ఉద్యోగంపట్ల సంతృప్తితో ఉన్నట్టు 97 శాతం మంది టీచర్లు చెప్పినట్టు వివరించింది. విద్యార్థుల హోం వర్క్, ఇతరత్రా అంశాలపై వారి తల్లిదండ్రుల నుంచి సరైన సహకారం అందట్లేదని 25 శాతం పాఠశాల యాజమాన్యాలు పేర్కొన్నట్టు తెలిపింది. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధా నం (ఎన్ఈపీ) చర్చలో కేవలం 58 శాతం మంది టీచర్లు మాత్రమే పాల్గొన్నట్టు వివరించింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.