హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వైన్ షాపులు తెరిపించండి...సీఎంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి లేఖ...

వైన్ షాపులు తెరిపించండి...సీఎంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి లేఖ...

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

మావ్రీ, తన లేఖలో మద్యపానం రాష్ట్రంలో "జీవన విధానం" కాబట్టి వైన్ షాపులు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇతర అవసరమైన వస్తువులతో పాటు కేటాయించిన రోజులలో వైన్ షాపులు తెరవడానికి అనుమతించాలని సంగ్మాను అభ్యర్థించారు.

  దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా మందుబాబులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రతిరోజు పెగ్గు పడితే కానీ పూట గడవని మందుబాబులు. ఇప్పుడు చుక్క దొరక్క విలవిలలా డిపోతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని వైన్‌ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ మేఘాలయ బీజేపీ చీఫ్‌ ఎర్నెస్ట్‌ మారీ రాష్ట్ర సీఎం కొన్రాడ్‌ కె. సంగ్మాకు శుక్రవారం లేఖ రాశారు. ఎర్నెస్ట్‌ ప్రస్తుతం ఖాసీ హిల్స్‌ వైన్‌ డీలర్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తు న్నారు.  మావ్రీ, తన లేఖలో మద్యపానం రాష్ట్రంలో "జీవన విధానం" కాబట్టి వైన్ షాపులు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇతర అవసరమైన వస్తువులతో పాటు కేటాయించిన రోజులలో వైన్ షాపులు తెరవడానికి అనుమతించాలని సంగ్మాను అభ్యర్థించారు. అంతేకాదు సామాజిక దూరం మరియు ప్రజా పరిశుభ్రత మార్గదర్శకాలను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  ఇదిలా ఉంటే మార్చి 25 నుండి హఠాత్తుగా వైన్ షాపులు మూసివేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో "మేఘాలయ ప్రజలలో ఎక్కువ మందికి మితంగా మద్యం సేవించడం ఎల్లప్పుడూ జీవన విధానమే" అని ఆయన అన్నారు. మేఘాలయ ప్రభుత్వం ఆరోగ్య కారణాలతో మద్యం పంపిణీకి అనుమతించే ఉత్తర్వును రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఈ అభ్యర్థన వచ్చింది. పొరుగున ఉన్న అస్సాంలో COVID- 19 కేసుల సంఖ్య 20 కి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వంలో వేడి అందుకుంది. "రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని," రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఎ.ఎల్.హెక్ అన్నారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Lockdown, Wine shops

  ఉత్తమ కథలు