హోమ్ /వార్తలు /జాతీయం /

ఉగ్రవాదులతో టచ్‌లో ఆ డాక్టర్..: కూపీ లాగుతున్న ఏటీఎస్

ఉగ్రవాదులతో టచ్‌లో ఆ డాక్టర్..: కూపీ లాగుతున్న ఏటీఎస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పాకిస్తాన్ మిలటరీ ఇంటలిజెన్స్(MI),ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ISI) డైరెక్షన్‌లో భారత జనాన్లు సేవించే ఆహార పదార్థాల్లో విషం కలిపేందుకు కుట్ర పన్నుతున్నాయని ఇటీవలే భారత నిఘా వర్గాలు సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఏటీఎస్ అదుపులో ఉన్న డాక్టర్‌ను ఆ కుట్రతో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇంకా చదవండి ...

  ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నాడన్న అనుమానంతో మహారాష్ట్రలోని కుల్తాబాద్‌కి చెందిన ఓ డాక్టర్‌ను యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS) అదుపులోకి తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్న అతను.. ఆర్థికంగా వారికి సహాయం అందిస్తున్నట్టు ఏటీఎస్ అనుమానిస్తోంది. అంతేకాదు, జవాన్లు తీసుకునే ఆహారం, మంచినీళ్లలో విషం కలపడానికి చేసిన కుట్రలోనూ అతని పాత్ర ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు.పాకిస్తాన్ మిలటరీ ఇంటలిజెన్స్(MI),ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ISI) డైరెక్షన్‌లో భారత జనాన్లు సేవించే ఆహార పదార్థాల్లో విషం కలిపేందుకు కుట్ర పన్నుతున్నాయని ఇటీవలే భారత నిఘా వర్గాలు సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఏటీఎస్ అదుపులో ఉన్న డాక్టర్‌ను ఆ కుట్రతో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


  తాజాగా ఔరంగాబాద్, ముంబ్రాలలో అరెస్టయిన 9 మంది అనుమానిత ఉగ్రవాదులతోనూ ఈ డాక్టర్‌కు సంబంధాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఏటీఎస్ ముంబ్రాలో అరెస్ట్ చేసినవారిలో మజర్ షేక్, జుమ్మన్ ఖుతేపాడ్, సల్మాన్ ఖాన్, ఫర్హద్ అన్సారీ, ఓ మైనర్ బాలిక ఉన్నారు. ఔరంగాబాద్‌లో పట్టుబడ్డవారిలో మహమ్మద్ సిరాజుల్లా ఖాన్, మహమ్మద్ తఖీలుల్లా, ఖాజీ సర్ఫ్‌రాజ్, తరేఖ్ ఉన్నారు. వీరందరూ బాగా చదువుకున్నవారేనని, సల్మాన్ ఈ గ్యాంగ్‌కి నేత్రుత్వం వహిస్తున్నాడని తెలిసింది.


  వీరి వద్ద నుంచి హైడ్రోజన్ పెరాక్సైడ్, విషపూరిత పౌడర్, యాసిడ్ వంటి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొలిటికల్ ర్యాలీలు, ప్రముఖుల వివాహ వేడుకలు, మతపరమైన కార్యక్రమాలు టార్గెట్‌గా వీరు ఉగ్ర కార్యకలాపాలకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.

  First published:

  Tags: Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Kashmir, Maharashtra, Pulwama Terror Attack

  ఉత్తమ కథలు