ALLAHABAD HIGH COURT SUGGESTS PM NARENDRA MODI AND ELECTION COMMISSION REGARDING POSTPONING OF UTTAR PRADESH ELECTIONS AK
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేయండి.. ప్రధాని, సీఈసీకి హైకోర్టు సూచన
అలహాబాద్ హైకోర్టు
Uttar Pradesh: కరోనా థర్డ్ వేవ్ నుంచి ప్రజలను రక్షించడానికి రాజకీయ పార్టీలు ప్రజలను సమీకరించవద్దని.. ఎన్నికల ర్యాలీలను నిషేధించాలని హైకోర్టు విజ్ఞప్తి చేసింది. రాజకీయ పార్టీలు టీవీలు, వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేయాలని కోర్టు పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పాటు త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ ఎన్నికలను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని ప్రధాని, ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు కోరింది. ప్రాణం ఉంటేనే ప్రపంచం ఉంటుంది కాబట్టి ప్రధాని దీనిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. దీనితో పాటు కరోనా థర్డ్ వేవ్ నుంచి ప్రజలను రక్షించడానికి రాజకీయ పార్టీలు ప్రజలను సమీకరించవద్దని.. ఎన్నికల ర్యాలీలను నిషేధించాలని విజ్ఞప్తి చేసింది. రాజకీయ పార్టీలు టీవీలు, వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేయాలని కోర్టు పేర్కొంది.
నార్త్ గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద జైలులో ఉన్న నిందితుడు సంజయ్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని కాంట్ పోలీస్ స్టేషన్లో సంజయ్ యాదవ్‌పై కేసు నమోదైంది. బెయిల్ దరఖాస్తును అనుమతిస్తూ దాదాపు నాలుగు వందల కేసులు కోర్టు ముందు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. కోర్టు ముందు సాధారణ కేసులు జాబితా చేయబడ్డాయి, దీని కారణంగా ఎక్కువ సంఖ్యలో న్యాయవాదులు ఉన్నారు. వారి మధ్య భౌతిక దూరం లేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోగులు పెరుగుతున్న సమయంలో ఈ పరిస్థితి నెలకొంది.
తమకు వస్తున్న సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో ఆరు వేల కొత్త కేసులు నమోదయ్యాయని, 318 మంది మరణించారని హైకోర్టు తెలిపింది. ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భయంకరమైన మహమ్మారి దృష్ట్యా, చైనా, నెదర్లాండ్స్, ఐర్లాండ్, జర్మనీ, స్కాట్లాండ్ వంటి దేశాలు పూర్తి లేదా పాక్షిక లాక్డౌన్ విధించాయని పేర్కొంది. అటువంటి పరిస్థితిలో ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవటానికి నియమాలను రూపొందించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను అభ్యర్థించింది. గతంలో లక్షలాది మందికి కరోనా సోకడం, ప్రజలు మరణించడం చూశామని.. గ్రామ పంచాయితీ ఎన్నికలు, బెంగాల్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో చాలామంది కరోనా సోకిందని పేర్కొంది.
భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న దేశంలో ఉచిత కరోనా వ్యాక్సినేషన్ ప్రచారాన్ని నిర్వహిస్తున్న దేశ ప్రధాని అభినందనీయులు అని హైకోర్టు పేర్కొంది. ఆయనను ప్రశంసించింది. ఈ భయంకరమైన మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని న్యాయస్థానం అభ్యర్థించింది. ఈ ఉత్తర్వుల కాపీని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు, ఎన్నికల కమిషనర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోర్టు ఆదేశించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.