Home /News /national /

ALLAHABAD HIGH COURT SAYS NO CRUELTY IF WIFE VISITS HER PARENTS HOUSE FREQUENTLY WITHOUT TAKING HUSBAND CONSENT PVN

భర్తలకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లే భార్యలు అర్జెంట్ గా ఈ విషయం తెలుసుకోవాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wife Visits Her Parents House Frequently: భార్యలు పుట్టింటికి వెళ్లడం సర్వసాధారణ విషయం. పండగలకు,సెలవలకు,శుభకార్యాలకు ఇలా మహిళలు పెళ్లి అయిన తర్వాత ఏదో సందర్భంలో పుట్టింటికి వెళ్లి వస్తుంటారు. అయితే అప్పుడప్పుడు భర్తతో గొడవపడో లేక అత్తమామలతో తగాదా అయితే కూడా పుట్టింటికి వెళ్తుంటారు.

ఇంకా చదవండి ...
Wife Visits Her Parents House Frequently: భార్యలు పుట్టింటికి వెళ్లడం సర్వసాధారణ విషయం. పండగలకు,సెలవలకు,శుభకార్యాలకు ఇలా మహిళలు పెళ్లి అయిన తర్వాత ఏదో సందర్భంలో పుట్టింటికి వెళ్లి వస్తుంటారు. అయితే అప్పుడప్పుడు భర్తతో గొడవపడో లేక అత్తమామలతో తగాదా అయితే కూడా పుట్టింటికి వెళ్తుంటారు. ఇదేం కొత్త విషయమేమీ కాదు. అయితే పుట్టింటికి వెళ్లేటప్పుడు భర్త పర్మిషనో లేక అత్తమామల పర్మిషనో తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే అలా భర్తకు చెప్పకుండా లేక అత్తింటివారి పర్మిషన్ తీసుకోకుండా మహిళలకు పుట్టింటికి వెళ్తే..అదేదో నేరంగా చూసేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు మన సమాజంలో. ఇలాగే ఓ భర్త కూడా.. తన భార్య తమ అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్తోందని,కాబట్టి తనకు ఆమె నుంచి విడాకులు(Divorce)కావాలని కోర్టుకెక్కాడు. చివరికి కోర్టు తీర్పుతో అతడి మైండ్ బ్లాక్ అయ్యింది.

ఉత్తరప్రదేశ్(UttarPradesh)రాష్ట్రానికి చెందిన మోహిత్ ప్రీత్ కపూర్-సుమిత్ కపూర్ భార్యా భర్తలు. 2013డిసెంబర్ లో వీరి వివాహం జరిగింది. అయితే జూలై 2017లో సుమిత్ కపూర్ తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ కోర్టుని ఆశ్రయించాడు. 2015 జనవరిలో తన భార్య మోహిత్ ప్రీత్ కపూర్...తాను,తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఎవరికీ చెప్పకుండా పుట్టింటికి(Parents House)వెళ్లిపోయిందని,ఎలాంటి కారణం లేకుండా తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని కాబట్టి ఆమె నుంచి విడాకులు కావాలని పిటిషన్‌ లో పేర్కొన్నాడు సుమిత్ కపూర్. తిరగి ఇంటికి రావాలని ఎన్నిసార్లు కోరినా,ఆమె అందుకు నిరాకరించిందని,అంతేకాకుండా తన దగ్గర ఉన్న సమయంలో ఇంటిపని కూడా చేయడానికి తన భార్య నిరాకరించేదని,అత్తమామలతో కూడా సరిగ్గా ప్రవర్తించేదికాదని పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే ఇదే సమయంలో హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 కింద భర్త నుంచి భరణం కోరుతూ సెప్టెంబరు 2017లో కోర్టుని ఆశ్రయించింది మోహిత్ ప్రీత్. నెలవారీ ఖర్చుల కింద భర్త తనకు రూ.5వేలు ఇవ్వాలని,తన కూతురి ఖర్చులకు రూ.2వేలు ఇవ్వాలని మోహిత్ ప్రీత్ కౌర్ తెలిపింది. జూలై 2016లో తన కుమార్తెతో పాటు తనను అత్తింటివారు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మోహిల్ ప్రీత్ తెలిపింది.



కలియుగ బకాసురుడు..వండిపెట్టడానికే ఇద్దరు భార్యలు..అతడి తిండికి భయపడి బంధువులు పంక్షన్లకు పిలవట్లేదట!

అయితే ఈ కేసులో విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు...10.01.2015న భర్త ఇంట్లో లేని సమయంలో కేవలం 400 మీటర్ల దూరంలోని తన పుట్టింటికి మోహిత్ ప్రీత్ కౌర్ వెళ్లినట్లు గుర్తించింది. ఆ సమయంలో మోహిత్ గర్భవతి అని,కాబట్టి తల్లిదండ్రుల స్వాంతన కోసం ఆమె పుట్టింటికి వెళ్లి ఉండవచ్చని తెలిపింది. అంతేకాకుండా, మోహిత్ ప్రీతం తన భర్త మరియు ఇతర కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా తన తల్లిదండ్రుల ఇంటికి తరచుగా వెళ్లడం నేరం కాదు అని కోర్టు సృష్టం చేసింది. 10.01.2015న మొదటగా మరియు చివరిగా 15.01.2017న ఆరోపించబడిన చర్యకు గల కారణం సేకరించబడిందని కోర్టు నిర్ధారించింది. రెండు సంవత్సరాల విడిచిపెట్టిన కాలం, రికార్డులో ఉన్న అంశాల నుండి నిరూపించబడలేదు. భార్య ప్రసవ సమయంలో భర్తే ఆసుపత్రిలో చేర్పించారని, చికిత్స కోసం ఖర్చులు భరించాడని కోర్టు గుర్తిచింది. భర్తతో కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఆమె తన భర్తను శాశ్వతంగా విడిచిపెట్టలేదని కేసుకు ఈ వాస్తవాలు రుజువు చేస్తున్నాయని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా పుట్టిన బిడ్డను తండ్రికి ఎప్పుడూ ఆమె దూరం చేయలేదని తెలిపింది. దీంతో ట్రయల్ కోర్టు మంజూరు చేసిన విడాకులని పక్కనబెట్టి..భర్త సుమిత్ నెలకు రూ.30,000 తన కూతురు మెయింటెనెన్స్ కోసం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2018 సెప్టెంబరులో దిగువ కోర్టు నిర్ణయించిన ప్రకారం భార్యకు కూడా భరణం మంజూరు చేయబడింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Uttar pradesh, Wife and husband

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు