హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: ప్రధానమంత్రిని అవమానించిన వ్యక్తికి షాక్.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

PM Modi: ప్రధానమంత్రిని అవమానించిన వ్యక్తికి షాక్.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రధానమంత్రితో సహా ఏ పౌరుడిని కించపరచడం వాక్ స్వాతంత్ర్యం కింద రక్షించబడదని హైకోర్టు పేర్కొంది. ప్రధానిని అవమానించడం భావప్రకటన స్వేచ్ఛ కాదని జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ రాజేంద్ర కుమార్-IVతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.

ఇంకా చదవండి ...

  భారత రాజ్యాంగం ప్రతి భారతీయుడికి మాట్లాడే హక్కు ఇచ్చింది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. అయితే ఈ హక్కును ఆసరాగా చేసుకుని మరొకరిని కించపరిచడం నిరాధారమైన ఆరోపణలు చేయడం, మరొకరిని దూషించే హక్కు ఎవరికీ లేదు. తాజాగా అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను దూషించిన వ్యక్తి విషయంలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రధానిని అవమానించడం భావప్రకటన స్వేచ్ఛ కాదని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులపై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఓ వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని సదురు వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.

  దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్ రద్దు చేసేందుకు నిరాకరించింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ముంతాజ్ మన్సూరి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఒకరిని కించపరిచేలా మాట్లాడటం భావప్రకటన స్వేచ్ఛ కాదని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. నిందితురాలు ముంతాజ్ మన్సూరీ ప్రధానిని, హోంమంత్రిని, ఇతర మంత్రులను దూషిస్తూ సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకర పోస్టులు పెట్టారు.

  ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ముంతాజ్ మన్సూరిని అరెస్టు చేశారు. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 504 (శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో అవమానించడం)‌తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. దీన్ని పిటిషనర్‌ హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. ఈ దేశ రాజ్యాంగం ప్రతి పౌరునికి వాక్ స్వాతంత్ర్యం లేదా భావప్రకటన స్వేచ్ఛను ప్రసాదించిందని... అయితే అలాంటి హక్కులో ఏ పౌరుడిపైనా దుర్భాషలాడడం లేదా అవమానకర ప్రకటనలు చేయడం లేదని పేర్కొంది.

  ప్రధానమంత్రితో సహా ఏ పౌరుడిని కించపరచడం వాక్ స్వాతంత్ర్యం కింద రక్షించబడదని హైకోర్టు పేర్కొంది. ప్రధానిని అవమానించడం భావప్రకటన స్వేచ్ఛ కాదని జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ రాజేంద్ర కుమార్-IVతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. నిందితుడికి ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అధికారులు ఈ విషయంలో చట్టానికి అనుగుణంగా ముందుకు సాగడానికి, దర్యాప్తును త్వరితగతిన ముగించడానికి వీలు ఉందని కోర్టు పేర్కొంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: High Court, Pm modi

  ఉత్తమ కథలు