ALLAHABAD HIGH COURT REDUCED THE SENTENCE OF A CONVICT WHO FORCED A CHILD TO PERFORM ORAL SEX FROM 10 YEARS TO 7 YEARS SSR
Allahabad High Court: మైనర్‌తో అంగచూషణ ఘోరమైన నేరం కాదన్న అలహాబాద్ హైకోర్టు.. నిందితుడికి శిక్ష తగ్గిస్తూ తీర్పు
అలహాబాద్ హైకోర్టు
కొన్నికొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఆ తీర్పు చుట్టూ ఎంతో తీవ్రంగా చర్చ జరుగుతుంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కోర్టు తీర్పులపై నెటిజన్లు తమ అభిప్రాయాలను బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు.
అలహాబాద్: కొన్నికొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఆ తీర్పు చుట్టూ ఎంతో తీవ్రంగా చర్చ జరుగుతుంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కోర్టు తీర్పులపై నెటిజన్లు తమ అభిప్రాయాలను బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు.
తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ఓ కేసులో వెల్లడించిన తీర్పు.. చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మైనర్ బాలుడితో అంగచూషణ(ఓరల్ సెక్స్) చేయించుకోవడం ఘోరమైన నేరం కాదని వ్యాఖ్యానిస్తూ.. ఈ కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ తీర్పు వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జ్ బెంచ్ ఆఫ్ జస్టిస్ అనిల్ కుమార్ ఓజా ఈ తీర్పును వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ జిల్లాలోని చిర్గావ్ గ్రామానికి చెందిన సోనూ కుష్వహ అనే వ్యక్తిపై మార్చి 26, 2016న దేవ్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కుష్వహ ఫిర్యాదు చేసిన వ్యక్తి దేవ్ సింగ్ ఇంటికి పెద్ద వాళ్లు ఎవరూ లేని సమయంలో వెళ్లి.. దేవ్ సింగ్ పదేళ్ల కొడుకును హర్దౌల్లోని ఓ ఆలయం దగ్గరకు తీసుకెళ్లాడు. తన పురుషాంగాన్ని చూషిస్తే 20 రూపాయలు ఇస్తానని కుష్వహ ఆ బాలుడికి డబ్బు ఆశ చూపాడు. ఆ పిల్లాడు అమాయకత్వంతో అందుకు ఒప్పుకోగానే కుష్వహ తన పురుషాంగాన్ని ఆ బాలుడి నోటిలో ఉంచి చూషించమని చెప్పాడు. ఆ బాలుడు అదే విధంగా చేశాడు. తన పైశాచిక పైత్యం తీర్చుకున్న కుష్వహ బాలుడి నోటిలోనే వీర్యాన్ని వదిలి తన కామ దాహాన్ని ఇంత నీచానికి దిగజారి తీర్చుకున్నాడు. ఆ తర్వాత బాలుడికి 20 రూపాయలు ఇచ్చి.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. చెబితే చంపేస్తానని బెదిరించాడు.
బాలుడి చేతిలో 20 రూపాయలను చూసిన దేవ్ సింగ్ మేనల్లుడు సంతోష్ ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని నిలదీయడంతో ఆ బాలుడు జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించాడు. ఇలా కుష్వహ చేసిన అకృత్యం బాలుడి తండ్రి దేవ్ సింగ్‌కు తెలిసింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుష్వహపై ఫిర్యాదు చేశాడు. దేవ్ సింగ్ ఫిర్యాదుతో కుష్వహపై ఝాన్సీలోని చిర్గావ్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 377, 506 ఐపీసీ, పోక్స్ చట్టం కింద కేసు నమోదైంది. సెషన్స్ కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
తాజాగా.. కుష్వహ తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 377, సెక్షన్ 506, పోక్స్ యాక్ట్ సెక్షన్ 6ను సవాల్ చేస్తూ కోర్టుకెక్కాడు. ఈ కేసును విచారించిన అలహాబాద్ న్యాయస్థానం జస్టిస్ అనిల్ కుమార్ ఓజా తీర్పును వెల్లడిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నోటిలో పురుషాంగాన్ని ఉంచడం అనేది తీవ్రమైన లైంగిక వేధింపుల పరిధిలోకి రాదని, పోక్సో చట్టంలోని సెక్షన్ 4 కింద మాత్రమే నిందితుడికి శిక్ష అమలవుతుందని స్పష్టం చేసింది. పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 6 పరిధిలోకి ఈ కేసు రాదని తెలిపింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.