HOME »NEWS »NATIONAL »all women indian pilot crew make history by flying over worlds longest route covered a distance of about 16000 km krs

చరిత్ర సృష్టించిన మన మహిళా పైలట్లు.. నిర్విరామంగా 16 వేల కిలోమీటర్లు..  

చరిత్ర సృష్టించిన మన మహిళా పైలట్లు.. నిర్విరామంగా 16 వేల కిలోమీటర్లు..  
Twitter image

Women power: దేశ అత్యంత సుదీర్ఘ కమర్షియల్ విమానాన్ని (Longest commercial flight) భారత్​కు చెందిన నలుగురు మహిళా పైలట్ల బృందం విజయవంతంగా నడిపింది. ఎలాంటి విరామం లేకుండా ఈ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ఈ బృందంలో తెలుగు అమ్మాయి కూడా ఉన్నారు.

  • Share this:
    భారత మహిళా పైలట్ల టీమ్ చరిత్ర సృష్టించింది. వైమానిక రంగంలో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే పది అత్యంత సుదీర్ఘమైన మార్గాల్లో ఒకటైన ప్రయాణాన్ని ఎలాంటి బ్రేక్ లేకుండా పూర్తి చేసింది.

    భారత మహిళా బృందంలోని నలుగురు పైలట్లు అమెరికాలోని శాన్​ ఫ్రాన్సిస్కో  ఉత్తర ధ్రువం నుంచి బెంగళూరుకు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బోయింగ్ 777ను నడిపారు. మొత్తం 13,993 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ఎలాంటి బ్రేక్ లేకుండా ఎయిర్ ఇండియా విమానాన్ని బెంగళూరుకు చేర్చారు. కెప్టెన్​ జోయా అగర్వాల్ నేతృత్వం వహించిన ఈ మహిళా పైలట్ల బృందంలో తెలుగమ్మాయి కెప్టెన్​ పాపగారి తన్మయి కూడా ఉన్నారు. కెప్టెన్ ఆకాంక్ష​ సోనావారే, కెప్టెన్ శివాని మన్హాస్ బృందంలోని మరో ఇద్దరు పైలట్లు.



    ఈ నెల 11వ తేదీన శాన్​ఫ్రాన్సిస్కోలో బయలుదేరిన విమానం సోమవారం (11వ తేదీ) దక్షిణ భారతంలోని బెంగళూరుకు చేరుకుంది. మొత్తం 16 గంటల పాటు నిరాటంకంగా ఈ ప్రయాణం సాగింది. చల్లటి గాలులతో విమానంలో కుదుపులు ఉంటాయని భావించినా.. ఎలాంటి సమస్య రాలేదు.

    “చరిత్ర సృష్టించేందుకు అవకాశం లభించించిన భారత బిడ్డలం మేం. భారత వైమానిక చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించగలిగాం. ఈ ఘనతలో పాలుపంచుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఈ విమానం నడిపేందుకు సంవత్సర కాలంగా సిద్ధమవుతున్నా” అని కెప్టెన్ జోయా అగర్వాల్ చెప్పారు.

    “ఈ ఫ్లైట్​ మరికొంత మంది మహిళలకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నాం. వైమానిక రంగం పురుషులది అన్న భావన క్రమంగా తగ్గుతోంది” అని బృందంలోని తెలుగు పైలట్​ పాపగారి తన్మయి చెప్పారు.

    శాన్​ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు కెంపె గౌడ విమానాశ్రయానికి చేరుకోగానే మహిళా పైలట్ల బృందానికి ఘన స్వాగతం లభించింది. అరుదైన ఘనత సాధించిన నలుగురు మహిళా పైలట్లను అందరూ ప్రశంసించారు. ఇక వీరిని ప్రశంసిస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్​దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. “భారత వైమానిక రంగంలో మహిళా పైలట్లు చరిత్ర సృష్టించారు. ఎంతో సంతోషించాల్సిన, సంబరం చేసుకోవాల్సిన సమయం ఉంది. కెప్టెన్ జోయా అగర్వాల్​, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావారే, కెప్టెన్ శివానీకి అభినందనలు” అని మంత్రి ట్వీట్ చేశారు.

    కాగా ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ దూరం ప్రయాణించిన వాణిజ్య విమానం ఇదేనని ఎయిరిండియా ప్రకటించింది.
    Published by:Krishna P
    First published:January 12, 2021, 09:48 IST