ఇదో వింత.. ఆ కుటుంబంలో 25 మంది కాళ్లు,చేతులకు..

యావలే కుమారుడు సంతోష్‌కు చేతులకు పన్నెండు వేళ్లు,కాళ్లకు 14 వేళ్లు ఉన్నాయి. పదో తరగతి వరకు చదువుకున్న అతను ఆర్మీ పరీక్షలకు హాజరవగా.. చేతులకు పన్నెండు వేళ్లు ఉన్న కారణంగా ఫిజికల్ టెస్టులో తిరస్కరించారు.

news18-telugu
Updated: September 18, 2019, 2:32 PM IST
ఇదో వింత.. ఆ కుటుంబంలో 25 మంది కాళ్లు,చేతులకు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాధారణంగా మనిషి చేతులు,కాళ్లకు పది వేళ్లు ఉంటాయి. కొంతమందికి ఒక చేతికి ఆరు వేళ్లు కూడా ఉంటాయి. అయితే కుటుంబంలో ఒకరికో,ఇద్దరికో అలా ఉండటం చూసుంటాం కానీ.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌కి చెందిన ఓ కుటుంబంలో ఏకంగా 25 మందికి 10 కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయి. దీని కారణంగా తాము చదువును కొనసాగించలేకపోయామని,ఉద్యోగాలు కూడా పొందలేకపోతున్నామని వారు వాపోతున్నారు.ఆ కుటుంబానికి చెందిన బల్‌దేవ్ యావలే మాట్లాడుతూ.. తమ కుటుంబంలో 25 మంది ఉండగా.. అందరికీ పాలిడాక్టిలీ అనే జన్యులోపం ఉందన్నారు. దాని కారణంగా ప్రతీ ఒక్కరికీ 10 కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయన్నారు.

కాళ్లు,చేతులకు పన్నెండు,పద్నాలుగు వేళ్లు ఉన్న కారణంగా.. స్కూస్కూల్లో మా పిల్లల్ని ఇతర పిల్లలు ఏడిపిస్తుండేవారు. అంతో ఇంతో చదివినవాళ్లకు కూడా ఎలాంటి ఉద్యోగాలు రావడం లేదు.ప్రభుత్వం మా కుటుంబానికి ఏదైనా సహాయం అందించాలని కోరుతున్నా. నాకు భూమి లేదు, చాలా నిరుపేదలం. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నా.
బల్‌దేవ్ యావలే


యావలే కుమారుడు సంతోష్‌కు చేతులకు పన్నెండు వేళ్లు,కాళ్లకు 14 వేళ్లు ఉన్నాయి. పదో తరగతి వరకు చదువుకున్న అతను ఆర్మీ పరీక్షలకు హాజరవగా.. చేతులకు పన్నెండు వేళ్లు ఉన్న కారణంగా ఫిజికల్ టెస్టులో తిరస్కరించారు. ఉద్యోగం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని.. ప్రభుత్వమే ఆదుకోవాలని అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. కాళ్లకు పద్నాలుగు వేళ్లు ఉన్న కారణంగా షాప్స్‌లో దొరికే చెప్పులు, షూస్ కూడా తనకు సరిపోవట్లేదని వాపోతున్నాడు.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 180కి.మీ దూరంలోని బేతుల్ పట్టణంలో నివసిస్తున్న ఈ కుటుంబం చేతివేళ్ల కథ
ఇప్పుడక్కడ చర్చనీయాంశంగా మారింది.
Published by: Srinivas Mittapalli
First published: September 18, 2019, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading