హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

TV Channels: టీవీ ఛానళ్లుకు కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు.. ఇకపై రోజూ అలా చేయాల్సిందే..

TV Channels: టీవీ ఛానళ్లుకు కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు.. ఇకపై రోజూ అలా చేయాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని అన్ని ఛానళ్లు జాతీయ ప్రాముఖ్యత, ప్రజా ప్రయోజనం ఉన్న కంటెంట్‌ను కచ్చితంగా ప్రసారం చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రజా ప్రయోజనాలకు కేంద్రం పెద్దపీట వేస్తోంది. జాతీయ ప్రాముఖ్యత, ప్రజా ప్రయోజనాలు ఉండే అంశాలను ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఇకపై దేశంలోని అన్ని ఛానళ్లు జాతీయ ప్రాముఖ్యత, ప్రజా ప్రయోజనం ఉన్న కంటెంట్‌ను కచ్చితంగా ప్రసారం చేయాలని సూచించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం(Union Government) జారీ చేసింది. సుమారు 11 సంవత్సరాల తర్వాత, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ టీవీ ఛానెల్‌ల(TV Channels) అప్‌లింక్, డౌన్‌లింక్ కోసం మార్గదర్శకాలను(Guidelines) బుధవారం ఆమోదించింది. ఈ గైడ్‌లైన్స్‌ను మొదట 2005లో జారీ చేయగా, 2011లో సవరించారు.

తాజా గైడ్‌లైన్స్ ప్రకారం.. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలకు టీవీ ఛానళ్లు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలకు ఉపయోగపడే కంటెంట్‌ను ప్రతిరోజూ తప్పకుండా 30 నిమిషాలపాటు ప్రసారం చేయాలి. విద్య , అక్షరాస్యత వ్యాప్తి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళల సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమం వంటి అంశాలపై కథనాలు ప్రసారం చేయాల్సి ఉంటుంది. సమాజంలోని విభాగాలు, పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ సమైక్యత రక్షణ వంటి అంశాలకూ చోటు కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది.

* ఛానెళ్లే స్టోరీలు రూపొందించాలి

కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలపై I&B సెక్రటరీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. 30 నిమిషాలపాటు ప్రసారం చేయాల్సిన స్టోరీలను కేంద్ర ప్రభుత్వం అందించదని తెలిపారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు లోబడి ఆయా ఛానళ్లు కంటెంట్‌ క్రియేట్‌ చేసుకోవాలని సూచించారు. సూచించిన థీమ్స్‌లో ఏదైనా ఎంచుకొనే స్వేచ్ఛ టీవీ ఛానళ్లకు ఉందని స్పష్టం చేశారు.

* ఛానళ్ల అప్‌లింక్‌కు అనుమతి

మార్గదర్శకాలు లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్నర్‌షిప్‌లను అనుమతిస్తాయి. శాటిలైట్‌ ద్వారా కవర్ చేస్తున్న దేశాల్లో కంటెంట్‌ను ప్రసారం చేయడం కోసం భారతీయ టెలిపోర్ట్‌ల నుంచి విదేశీ ఛానళ్లను అప్‌లింక్ చేయడానికి అనుమతి ఉంటుంది. ఉపఖండంలో ప్రసారమయ్యే ఛానళ్ల కోసం అప్‌లింకింగ్ హబ్‌గా సింగపూర్‌ ఉంది. దీనికి బదులుగా భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ టెలివిజన్ ఛానళ్లను భారతదేశం నుంచి అప్‌లింక్ చేయడానికి అనుమతి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నమోదైన మొత్తం 897 ఛానళ్లలో కేవలం 30 మాత్రమే భారతదేశం నుంచి అప్‌లింక్ అవుతున్నాయి.

Earthquake: అరుణాచల్‌లో భూకంపం.. వరుస ప్రకంపనలతో భయం భయం.. ఇది దేనికి సంకేతం?

Gujarat Elections: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. జడేజా భార్యకు టికెట్..

* ముందస్తు అనుమతి అవసరం లేదు

ఈవెంట్‌ల ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరడాన్ని తొలగించినట్లు జాయింట్ సెక్రటరీ (ప్రసారం) సంజీవ్ శంకర్ మీడియాతో తెలిపారు. ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఈవెంట్‌ల ముందస్తు నమోదు మాత్రమే అవసరమని స్పష్టం చేశారు. స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డీ) నుంచి హై డెఫినిషన్ (హెచ్‌డీ)కి లేదా హెచ్‌డీ నుంచి ఎస్‌డీకి భాష మార్చడానికి లేదా ట్రాన్స్‌మిషన్ మోడ్‌ను మార్చడానికి ముందస్తు అనుమతి అవసరం లేదని ఆయన చెప్పారు. ఛానల్‌ మార్పుల గురించి మంత్రిత్వ శాఖకు మాత్రమే తెలియజేయాలి.

కొత్త మార్గదర్శకాలలో ఒక కంపెనీ డిజిటల్ శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్ (DSNG) కాకుండా ఆప్టిక్ ఫైబర్, బ్యాక్ ప్యాక్, మొబైల్ వంటి వార్తల సేకరణ పరికరాలను ఉపయోగించవచ్చని పేర్కొంది. దీనికి ప్రత్యేక అనుమతి అవసరం లేదు. ఎలక్ట్రానిక్ వార్తలను సేకరించే డివైజెస్ ఉపయోగించవచ్చని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

First published:

Tags: TV channels

ఉత్తమ కథలు