హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చేందుకు అన్ని కోట్ల ఖర్చవుతుందా? ఆ డబ్బులు ఎవరిస్తారు?

Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చేందుకు అన్ని కోట్ల ఖర్చవుతుందా? ఆ డబ్బులు ఎవరిస్తారు?

నోయిడా ట్విన్ టవర్స్

నోయిడా ట్విన్ టవర్స్

Noida Twin Towers Demolition Cost: సాధారణంగా ఇంత భారీ భవనాన్ని కట్టేందుకు వందల కోట్లు ఖర్చవుతుంది. ఐతే దీనిని కూల్చేందుకు కూడా కోట్లల్లోనే ఖర్చవుతుంది. . కూల్చివేతలో భాగంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.267 ఖర్చుకానుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తతయూపీలోని నోయిడా (Noida)లో నిబంధనలను విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ (అపెక్స్‌, సెయానే టవర్లు) కూల్చివేత (Noida Twin Towers Demolition) కు సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం దీనిని బాంబులతో కూల్చనున్నారు. ఇది ఢిల్లీ(Delhi)లోని కుతుబ్‌మినార్‌ కంటే ఎత్తుగా ఉంటుంది. ఇందులో ఒక భవనం ఎత్తు 108 మీటర్లు ఉండగా.. మరో భవనం ఎత్తు 97 మీటర్లు. ఈ భారీ బిల్డింగ్‌ను సూపర్ టెక్ సంస్థ (Super Tech) నిర్మించింది. నోయిడాలోని సెక్టార్‌ 93లో ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాటిని కూల్చివేయాలని చాలా కాలం క్రితమే ఆదేశాలు ఇచ్చింది. ఐతే పలు కారణాలు వల్ల ఈ కూల్చివేత ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం రెండున్న గంటలకు కూల్చనున్నారు. అన్ని అంతస్తుల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. 100 మీటర్ల దూరంలో ఉన్న బటన్‌ను నొక్కడం ద్వారా.. కేవలం 10 సెకన్లలోనే ఈ రెండు భవనాలు పేక మేడల్లా కూలిపోనున్నాయి.


  PM Modi: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. అదే భవిష్యత్తు అంటూ..


  ట్విన్ టవర్స్‌లో మొత్తం 915 ప్లాట్స్ ఉన్నాయి. ఒక్కో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ విలువ రూ.1.13 కోట్లు. వీటిని అమ్మితే రూ. 1200 కోట్లు వస్తాయి. ఇప్పటికే 633 ప్లాట్స్ బుక్ అయ్యాయి. అందుకోసం కొనుగోలుదారుల నుంచి రూ.180 కోట్లను సేకరించింది సూపర్ టెక్ సంస్థ. కానీ అక్రమ నిర్మాణంగా నిర్ధారించి.. వాటిని కూల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. తాము సేకరించిన డబ్బును తిరిగి కొనుగోలు దారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు 12శాతం వడ్డీ కూడా ఇవ్వాలి.


  Congress: సింధియా నుంచి ఆజాద్ వరకు.. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన 13 మంది ముఖ్య నేతలు వీళ్లే


  సాధారణంగా ఇంత భారీ భవనాన్ని కట్టేందుకు వందల కోట్లు ఖర్చవుతుంది. ఐతే దీనిని కూల్చేందుకు కూడా కోట్లల్లోనే (Noida Twin Towers Demolition Cost) ఖర్చవుతుంది..కూల్చివేతలో భాగంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.267 ఖర్చుకానుంది. ఈ లెక్కన7.5 లక్షల చదరపు అడుగుల్లో ఉన్న నిర్మాణాలను కూల్చేందుకు దాదాపు రూ.20 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రూ.5 కోట్లు సూపర్ టెక్ కంపెనీ చెల్లింస్తుంది. మిగిలిన డబ్బును భవన వ్యర్థాలను విక్రయించడం ద్వారా సమీకరిస్తారు. ఈ రెండు భవనాలను కూల్చివేస్తే 55వేల టన్నుల వ్యర్థాలు వస్తాయి. అందులో నాలుగు వేలకు పైగా స్టీలే ఉంటుందని అధికారులు వెల్లడించారు.  ట్విన్ టవర్స్‌ను కూల్చేందుకు ఎడిపైస్ అనే సంస్థ ఒప్పందం తీసుకుంది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా రూ.100 కోట్ల బీమా కూడా చేయించింది. పరిసర ప్రాంతాల్లో ఏదైనా నష్టం సంభవిస్తే దీనిని చెల్లిస్తారు. హర్యాణాలోని పాల్‌వాల్‌ నుంచి కూల్చివేతలో ఉపయోగించే పేలుడు పదార్ధాలను తీసుకొచ్చి భవనంలో అమర్చారు. డైనమైట్‌, ఎమల్షన్స్, ప్లాస్టిక్ పదార్థాలు కలగలిసిన 3,700 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించారు. మొత్తం 100 మంది సిబ్బంది కలిసి రెండు బిల్డింగ్స్‌లో బాంబులను పెట్టారు. ఆగస్టు 28న చేతన్‌ దత్తా అనే భారత బ్లాస్టర్‌ ఫైనల్‌ స్విచ్‌ నొక్కి.. ఈ భవనాలను కూల్చివేయనున్నారు. భవనాలు కూలిపోయిన తర్వాత పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఏర్పడతాయి. మూడు నెలల సమయం పడుతుందట. పక్కన ఉండే నివాస భవనాలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీటిని కూల్చనున్నారు. అది ఉన్న స్థలంలోనే కూలిపోయేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మనదేశంలో చాలా అరుదుగా జరిగే ఇలాంటి కూల్చివేత కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: New Delhi, Noida, Uttar pradesh

  ఉత్తమ కథలు