Amarnath Yatra : అంతా రెడీ..ఎల్లుండి నుంచే అమర్ నాథ్ యాత్ర ప్రారంభం
అమర్ నాథ్ యత్ర
Amarnath Yatra 2022 : కరోనా(Covid) కారణంగా రెండేళ్లపాటు నిరీక్షించిన తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర (Amarnath yatra) ప్రారంభమవుతోంది. ఇందుకోసం శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది.
కరోనా(Covid) కారణంగా రెండేళ్లపాటు నిరీక్షించిన తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర (Amarnath yatra) ప్రారంభమవుతోంది. ఇందుకోసం శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర ఈ ఏడాది జూన్ 30, గురువారం నుండి ప్రారంభమై ఆగస్టు 11, శ్రావణ పూర్ణిమ అనగా రాఖీ పండుగ రోజున ముగుస్తుంది. 2019లో అర్టికల్ 370 రద్దుతో యాత్రను అర్ధంతరంగా నిలిపివేయగా..2020, 2021లో కరోనా కారణంగా యాత్రను నిర్వహించలేదు. జూన్ 30 నుండి అమర్నాథ్ యాత్ర (Amarnath yatra)ప్రారంభం నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం అమర్ నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు.
అమర్ నాథ్ యాత్రికుల భద్రత విషయంలో పోలీస్ యాంత్రంగం చాలా కట్టు దిట్టమైన చర్యలను తీసుకుంటోంది. ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో భద్రతను టైట్ చేశారు. ఉగ్రవాదల చర్యలను అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టారు. ఇక,యాత్రకు వచ్చేవారు ఆధార్ కార్డు లేదా బయోమెట్రిక్ వివరాల ఆధారంగా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు సూచించింది. యాత్రకు రాలేని వారి కోసం ఆన్లైన్ దర్శన ఏర్పాట్లు కూడా చేసింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర మొత్తం 43 రోజులు ఉంటుంది.
కాగా,శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని అమర్ నాథ్... భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది. సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది. మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన శివ లింగం ఇక్కడి ముఖ్య ఆకర్షణ. హిందూ మత పురాణాల ప్రకారం... శివుడిని పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకు వెళ్ళి జీవిత రహస్యాలు వెల్లడించాడు. అయితే రెండు పావురాళ్లు.. శివుడు మాటలను గుహలో దాగి రహస్యంగా విన్నాయి. శివుని రహస్యం చాటుగా విన్న ఆ రెండు పావురాలు మరల మరల జన్మిస్తూ ఉన్నాయి. అందుచేతనే అవి అమర్ నాథ్ గుహను తమ నిత్య నివాసం గా చేసుకున్నాయి.అమర్ నాథ్ గుహ చేరుకోగానే, యాత్రికులు పావురాల జంటను చూడవచ్చు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.