Ayodhya Verdict : రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు... అయోధ్య కేసు తీర్పుపై ముందు జాగ్రత్తలు

Ayodhya Verdict 2019 : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా... అవాంచనీయ ఘటనలు ఏవైనా జరుగుతాయేమోనని అన్ని రాష్ట్రాల్లో టెన్షన్ ఉంది. అందుకే ముందుగా చాలా రాష్ట్రాలు స్కూళ్లకు సెలవులు ఇచ్చేశాయి.

news18-telugu
Updated: November 9, 2019, 8:29 AM IST
Ayodhya Verdict : రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు... అయోధ్య కేసు తీర్పుపై ముందు జాగ్రత్తలు
రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు... అయోధ్య కేసు తీర్పుపై ముందు జాగ్రత్తలు
  • Share this:
Ayodhya Verdict 2019 : ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూ, కర్ణాటకలో ఇవాళ స్కూళ్లు, విద్యాసంస్థలు తెరచుకోవట్లేదు. యూపీలో ఏకంగా సోమవారం వరకూ తెరచుకోవట్లేదు. కారణం అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతుండటమే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా టెన్షన్ పడుతున్నారు. తీర్పు ఎలా ఉన్నా ప్రజలు సంయమనంతో ఉండాలని... ఎలాంటి వేడుకలూ జరుపుకోవద్దనీ, పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరుకుంటున్నారు. సుప్రీంకోరు ఎలాంటి తీర్పు ఇచ్చినా అందరూ సంయమనంతో తీర్పును స్వాగతించాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదన్న ఆయన... ప్రజల రక్షణ, భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉదయం పదిన్నరకు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వనుంది.

ఢిల్లీలో అన్ని ప్రభుత్వ స్కూళ్లకూ ఇవాళ సెలవులు ప్రకటించామన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా... ప్రైవేట్ స్కూళ్లు కూడా మూసేస్తే మంచిదని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా భద్రతా పరమైన సమస్యలు తలెత్తవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అయోధ్య కేసుపై దాదాపు 40 రోజులపాటూ విచారించిన సుప్రీంకోర్టు... అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో ఉంచింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ... కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం... శాంతి భద్రతలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాయి. అంతా కంట్రోల్‌లో ఉందని క్లారిటీ వచ్చాక... తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది.

అయోధ్యలోని 2.77 ఎకరాల భూమికి సంబంధించినది ఈ వివాదం. ఈ ప్రదేశం శ్రీరామచంద్రస్వామి పుట్టిన ప్రదేశంగా హిందువులు భావిస్తున్నారు. ఐతే... ఇదే ప్రదేశంలో 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబర్... ఓ మసీదును నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దీనిపై 1992లో హిందుత్వవాదులు అభ్యంతరం చెప్పారు. అప్పట్లో బాబ్రీమసీదు కూల్చివేత ఘటన జరిగి... ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై అందరికీ ఆసక్తి ఉంది. అలాగే ప్రభుత్వాలకు టెన్షనూ ఉంది. ఏ తీర్పు ఇచ్చినా... దాన్ని చక్కగా స్వాగతించి... సర్దుకుపోతే ఏ సమస్యా ఉండదని అన్ని ప్రభుత్వాలూ కోరుతున్నాయి.


Pics : బ్రైడల్ ఫొటోషూట్‌లో మెరిసిన జియా మానెక్ఇవి కూడా చదవండి :Ayodhya Verdict : దేశవ్యాప్తంగా హైఅలర్ట్... అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పేంటి?

RTC Strike : నేడు ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్...

సీతాఫలంపై అపోహలు, నిజాలు... ఈ సీజన్‌లో ఎందుకు తినాలంటే...

డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు

Published by: Krishna Kumar N
First published: November 9, 2019, 6:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading