జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు... మళ్లీ తెరచుకున్న స్కూళ్లు

జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు... మళ్లీ తెరచుకున్న స్కూళ్లు (credit - twitter - Ashok K Pandey अशोक)

Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్‌లో ఆందోళనలు తగ్గడంతో... మళ్లీ స్కూళ్లు, కాలేజీలు తెరచుకున్నాయి. ఐతే... భద్రతా బలగాలు పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నాయి.

 • Share this:
  Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్‌కి స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించినప్పటి నుంచీ... రెండు నెలలకు పైగా ఆందోళన పరిస్థితులు కొనసాగాయి. దాంతో... భారీ ఎత్తున భద్రతా బలగాల్ని మోహరించిన కేంద్ర ప్రభుత్వం... ఎక్కడికక్కడ ఆంక్షలు విధించింది. ముఖ్యంగా కాశ్మీర్ లోయలో పరిస్థితిని పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. రాజకీయ పార్టీలకు కూడా కండీషన్లు పెట్టింది. నేతల్ని ఆయా ప్రాంతాల్లో తిరగనివ్వకుండా నిర్బంధించింది. క్రమంగా పరిస్థితులు సద్దుమణగడంతో... గత సోమవారం స్కూళ్లు, కాలేజీలను తెరవాలని అనుకుంది. ఐతే... చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్న కేంద్ర ప్రభుత్వం... మరోసారి జిల్లాల యంత్రాంగాలు, స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపి... ఇవాళ వాటిని తిరిగి ఓపెన్ చేసింది. స్కూళ్లు మూతపడిన రెండు నెలలకూ ఫీజులు, బస్ ఛార్జీలను వసూలు చేయట్లేదని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తెలిపాయి.

  స్కూళ్లు, కాలేజీలూ ఇవాళ్టి నుంచీ తెరచుకుంటున్నా... అవి ఎన్ని రోజులు కొనసాగుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం... త్వరలోనే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)పై దృష్టిసారిస్తోందనీ, దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే... కాశ్మీర్ లోయలో మళ్లీ ఆందోళనలు భగ్గుమంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో పాకిస్థాన్ సైతం... సరిహద్దుల్లో చొరబాట్లను పెంచుతోంది. ఉగ్రమూకలను రెచ్చగొడుతోంది. ఈ పరిణామాలు కాశ్మీర్‌లో శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయి.

  స్థానిక రాజకీయ పార్టీలు... పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటూ... యువతను కేంద్రానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతుంటే... పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని కేంద్ర వర్గాలు మండిపడుతున్నాయి. అందువల్ల భద్రతా బలగాలు ప్రధానంగా యువతను కంట్రోల్ చెయ్యడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.

   

  Pics : రియల్ లైఫ్ బార్బీ గర్ల్ అంజెలికా క్యూట్ ఫొటోస్
  ఇవి కూడా చదవండి :

  Rain Alert : నేడు హైదరాబాద్‌కి భారీ వర్ష సూచన...


  ఐదో రోజు ఆర్టీసీ సమ్మె... నేడు ప్రభుత్వం, ఉద్యోగులు, అఖిలపక్షాల వేర్వేరు భేటీలు

  Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే

  Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

  Health Tips : స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు
  First published: