2008 జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నలుగురు నిందితులను దోషిగా తేల్చిన కోర్టు.. వారికి మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. దోషులు మహమ్మద్ సైఫ్, మహమ్మద్ సర్వార్ అజ్మీ, మహమ్మద్ సల్మాన్, సైఫు రెహమాన్‌కు ఉరిశిక్ష విధించింది కోర్టు.
2008 మే 13న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. నాటి ఘటనలో 70 మంది చనిపోగా.. 185 మంది గాయపడ్డారు. ఆ రోజు జైపూర్‌లో ఎనిమిది చోట్ల పేలుళ్లు జరిగాయి. మనక్ చౌక్ పోలిస్ స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో మహమ్మద్ సైఫ్, చంద్‌పోల్ హనుమాన్ ఆలయం వద్ద జరిగిన పేలుడులో మహమ్మద్ సర్వార్ అజ్మీ, సంగనేరి హనుమాన్ టెంపుల్ వద్ద జరిగిన బ్లాస్ట్‌లో మహమ్మద్ సల్మాన్‌కు ప్రేమయమున్నట్లు కోర్టు తేల్చింది. ఇక సైఫు రెహ్మాన్ పలు పోట్ల బాంబులు పెట్టినట్లు వెల్లడింది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది జైపూర్ స్పెషల్ కోర్టు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.