ఢిల్లీలో వాయుకాలుష్యం స్థాయి తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 5వ తేదీ వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ‘ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరిగింది. అందుకే నవంబర్ 5 వరకు ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.’ అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైతులు పొలాలను తగలబెడుతుండడంతో పెద్ద ఎత్తున పొగలు రాజధానిని చుట్టుముడుతున్నాయి. దీంతో వాయుకాలుష్యం డేంజర్ లెవల్స్ దాటింది. దీనిపై స్పందించిన కాలుష్య నియంత్రణ అధారిటీ.. ‘న్యూఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం’లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఢిల్లీ చుట్టుపక్కల నవంబర్ 5 వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చింది. అలాగే, చలికాలం మొత్తం ఎవరూ టపాసులు కాల్చవద్దని ఆదేశించింది.
दिल्ली में पराली के बढ़ते धुएँ के चलते प्रदूषण का स्तर बहुत ज़्यादा बढ़ गया है. इसलिए सरकार ने निर्णय लिया है कि दिल्ली के सभी स्कूल 5 नवम्बर तक बंद रहेंगे
మరోవైపు ఢిల్లీ పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలు.. ఈ పొలాలను తగలబెట్టే అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పంట నూర్పిళ్ల తర్వాత మిగిలిన గడ్డిని కొందరు రైతులు పొలాల్లోనే తగలబెట్టేస్తున్నారు. దీంతో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది.
పెళ్లిలో డీజే గొడవ.. కొట్టుకున్న బంధువులు
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.